Abu Dhabi T10 League: Tom Kohler Cadmore Misses Record Century, Goes Viral - Sakshi
Sakshi News home page

Abu Dhabi T10 League: సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో.. అయినా ఊచకోతే

Dec 2 2021 9:13 AM | Updated on Dec 2 2021 10:18 AM

Kohler-Cadmore 96 Runs 39 Balls Wanindu Hasaranga 5 Wickets T10 League - Sakshi

యూఏఈ వేదికగా టి10 లీగ్‌లో డెక్కన్‌ గ్లాడియేటర్స్‌, బెంగాల్‌ టైగర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌ కోహ్లర్-కాడ్మోర్ విధ్వంసం సృష్టించాడు. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఔటైనప్పటికి బౌలర్లను ఊచకోత కోశాడు. 39 బంతుల్లోనే 12 ఫోర్లు.. 5 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. అతని దాటికి నిర్ణీత 10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 140 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో టామ్‌ కోహ్లర్‌ టి10 చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆండీ రసెల్‌ 26, ఒడెయిన్‌ స్మిత్‌ 12 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్‌ టైగర్స్‌ 8.3 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. ఇసురు ఉడాన 33 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ బౌలర్‌ వనిందు హసరంగా 5 వికెట్లతో దుమ్మురేపాడు.

చదవండి: T10 League: బంతి గట్టిగా తగిలినట్టుంది.. పాపం అంపైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement