
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలిసారి బ్యాట్ ఝులిపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతున్న రాహుల్ ఐపీఎల్‌లో 4వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల మార్క్‌ను అందుకున్న ఆటగాడిగా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో కోహ్లి, గేల్, వార్నర్, ఏబీ డివిలియర్స్ లాంటి స్టార్లకు సాధ్యం కాని రికార్డుతో రాహుల్ మెరవడం విశేషం. కేఎల్ రాహుల్‌కు 105 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించి తొలి స్థానంలో నిలిచాడు. అతని తర్వాత క్రిస్ గేల్(112 ఇన్నింగ్స్‌లు), డేవిడ్ వార్నర్(114 ఇన్నింగ్స్‌లు), విరాట్ కోహ్లి(128 ఇన్నింగ్స్‌లు), ఏబీ డివిలియర్స్(131 ఇన్నింగ్స్‌లు) వరుసగా ఉన్నారు.