స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్‌ చేస్తున్న కేకేఆర్‌ ఆటగాళ్లు.. వీడియో వైరల్‌

KKR Players Beat the Heat with water Aerobics in The Pool - Sakshi

KKR players in the Swimming pool: ఐపీఎల్‌ 2021 సెకెండ్‌ ఫేజ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్  ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడానికి   అడుగు దూరంలో నిలిచింది. ఈ క్రమం లో కేకేఆర్‌ ఆటగాళ్లు తమ  హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ను కేకేఆర్‌ షేర్‌ చేసింది. ఈ వీడియోలో ఆ జట్టు స్పిన్నర్‌ అకేల్ హుస్సేన్ ఏరోబిక్స్‌( డ్యాన్స్‌ ఎక్సర్‌ సైజ్‌) చేస్తుండగా  సహచర ఆటగాళ్లు పూల్‌లో తనను  అనుకరించారు.

దీంట్లో ఆ జట్టు కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఇప్పటి వరకు 13మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో కోలకతా నాల్గవ స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల్లో ఓపెనర్‌ వెంకటేష్ అయ్యర్ , స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, గిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా కేకేఆర్‌ తన చివరి లీగ్ మ్యాచ్‌లో  రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుం‍ది.

చదవండి: క్రికెట్‌ జట్టు వాహనంలో చోరీ.. లబోదిబోమంటున్న ఆసీస్‌ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top