ఒకే మ్యాచ్‌.. రెండు సూపర్‌ ఓవర్లు

Kings Punjab Beat By Mumbai Indians In Second Super Over - Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు సూపర్‌ ఓవర్లు పడ్డాయి. ఇందుకు ముంబై ఇండియన్స్‌-కింగ్స్‌ పంజాబ్‌ మ్యాచ్‌ వేదికైంది.  ముందు జరిగిన సూపర్‌ ఓవర్‌ టై కావడంతో రెండో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. తొలి సూపర్‌ ఓవర్‌లో ఇరు జట్లు ఐదేసి పరుగులే చేయడంతో రెండో సూపర్‌ ఆడించారు. ఆ సూపర్‌ ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌ను విజయం వరించింది. రెండో సూపర్‌ ఓవర్‌లో ముంబై 11 పరుగులు చేయగా, దాన్ని కింగ్స్‌ ఛేదించింది.  మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌లు బ్యాటింగ్‌కు దిగారు. బౌల్ట్‌  వేసిన తొలి బంతిని గేల్‌ సిక్స్‌ కొట్టగా, ఆ తర్వాత బంతికి సింగిల్‌ తీశాడు. ఇక మూడో బంతికి అగర్వాల్‌ ఫోర్‌ కొట్టాడు. ఇక నాల్గో బంతికి మరో బౌండరీకి కొట్టడంతో కింగ్స్‌ పంజాబ్‌ లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచింది.

అంతకముందు ప్రధాన మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 177 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క‍్రమంలో కింగ్స్‌ పంజాబ్‌ కూడా సరిగ్గా అన్ని పరుగులే చేసింది. చివరి ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌ విజయానికి 9 పరుగులు అవసరం కాగా,  8 పరుగులే చేశారు. బౌల్ట్‌ వేసిన ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేయడంతో మ్యాచ్‌ టై అయ్యింది. దాంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది.  కేఎల్‌ రాహుల్‌(77;51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి రాణించాడు,. కింగ్స్‌ పంజాబ్‌ జట్టులో టాపార్డర్‌ ఆటగాళ్లు విఫలమైనా రాహుల్‌ మాత్రం మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.  లక్ష్య ఛేదనలో కింగ్స్‌ పంజాబ్‌ ఆదిలోనే మయాంక్‌ అగర్వాల్‌(11) వికెట్‌ను  కోల్పోయింది. క్రిస్‌ గేల్‌(24; 21 బంతుల్లో 1 ఫోర్‌, 2సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా, నికోలస్‌ పూరన్‌(24; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్‌లు) ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. కింగ్స్‌  విజయానికి 24 పరుగులు కావాల్సిన తరుణంలో రాహుల్‌ ఔటయ్యాడు. బుమ్రా వేసిన 18 ఓవర్‌ మూడో బంతికి రాహుల్‌ బౌల్డ్‌ అయ్యాడు. కింగ్స్‌ పంజాబ్‌ రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా, దీపక్‌  హుడా, జోర్డాన్‌లు 21 పరుగులే చేశారు. 

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 176 పరుగులు చేసింది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ ఆదిలోనే రోహిత్‌ శర్మ(9), సూర్యకుమార్‌ యాదవ్‌(0) వికెట్లను కోల్పోయింది. అర్షదీప్‌ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి రోహిత్‌ ఔట్‌ కాగా, షమీ వేసిన నాల్గో ఓవర్‌ మూడో బంతికి సూర్యకుమార్‌ డకౌట్‌ అయ్యాడు. ఇక ఇషాన్‌ కిషన్‌(7) కూడా నిరాశపరిచాడు. డీకాక్‌(53; 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)లకు జతగా కృనాల్‌ పాండ్యా(34; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. హార్దిక్‌ పాండ్యా(8) విఫలం కాగా, చివర్లో పొలార్డ్‌(34 నాటౌట్‌; 12 బంతుల్లో 1 ఫోర్‌,  4 సిక్స్‌లు), కౌల్టర్‌ నైల్‌(24 నాటౌట్‌; 12 బంతుల్లో  4 ఫోర్లు)లు బ్యాట్‌ ఝుళిపించడంతో ముం‍బై గౌరవప్రదమైన స్కోరు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, అర్షదీప్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, క్రిస్‌ జోర్డాన్‌, రవి బిష్నోయ్‌లు చెరో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

30-10-2020
Oct 30, 2020, 11:46 IST
దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ప్లేఆఫ్‌కు వెళ్లిన తొలి జట్టుగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ నిలిచింది.  ఇక గతేడాది...
30-10-2020
Oct 30, 2020, 10:04 IST
దుబాయ్‌ : ఐపీఎల్‌-2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి దాదాపు దూరమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) పోతూపోతూ కోల్‌కత్తా నైట్‌...
30-10-2020
Oct 30, 2020, 08:10 IST
న్యూఢిల్లీ: పేలవ ప్రదర్శనతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సారి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు దూరమైనా... వచ్చే ఏడాది కూడా ఎంఎస్‌...
30-10-2020
Oct 30, 2020, 05:06 IST
చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోతూ పోతూ కోల్‌కతానూ లీగ్‌ నుంచే తీసుకెళ్లనుంది. మిగిలున్న రెండు మ్యాచ్‌ల్ని తప్పనిసరిగా గెలిచినా... అంతంత...
29-10-2020
Oct 29, 2020, 23:17 IST
దుబాయ్‌: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 5వ విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్‌ విధించిన 173 పరుగుల...
29-10-2020
Oct 29, 2020, 21:50 IST
దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి...
29-10-2020
Oct 29, 2020, 21:15 IST
దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి...
29-10-2020
Oct 29, 2020, 19:08 IST
దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కేకేఆర్‌ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్‌...
29-10-2020
Oct 29, 2020, 16:59 IST
దుబాయ్‌ : ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి...
29-10-2020
Oct 29, 2020, 16:02 IST
అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జైత్రయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో...
29-10-2020
Oct 29, 2020, 14:58 IST
అబుదాబి: నువ్వా- నేనా అంటూ పోటీపడే సందర్భంలో భావోద్వేగాలు నియంత్రించుకోవడం ఎవరికైనా కాస్త కష్టమే. ముఖ్యంగా క్రీడాకారుల విషయంలో ఇలాంటి...
29-10-2020
Oct 29, 2020, 14:08 IST
అబుదాబి: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌-2020 సీజన్‌లోనూ సత్తా చాటుతోంది. బుధవారం నాటి మ్యాచ్‌లో కోహ్లి సారథ్యంలోని రాయల్స్‌...
29-10-2020
Oct 29, 2020, 10:45 IST
ఐపీఎల్‌ 2020లో భారత  క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సారథ్యం వహిస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీం వరుస రెండు పరాజయాలు మూటగట్టుకున్న...
29-10-2020
Oct 29, 2020, 10:17 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు.
29-10-2020
Oct 29, 2020, 04:39 IST
మరోసారి అద్భుత ప్రదర్శన నమోదు చేసిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు ఐపీఎల్‌–2020లో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను దాదాపు...
28-10-2020
Oct 28, 2020, 23:00 IST
అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆర్‌సీబీపై విజయం సాధించిన ముంబై ఈ సీజన్‌లో  ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా...
28-10-2020
Oct 28, 2020, 21:41 IST
ముంబై : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో దారుణమైన ప్రదర్శన కనబరిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ లీగ్‌ నుంచి వైదొలిగిన తొలి జట్టుగా...
28-10-2020
Oct 28, 2020, 21:13 IST
అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా ఆర్‌సీబీ ముంబై ఇండియన్స్‌కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్‌ గెలిచిన...
28-10-2020
Oct 28, 2020, 19:15 IST
అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌ ముగింపు దశకు వస్తుండడంతో ప్లేఆఫ్స్‌కు ముందుగా ఏ జట్టు చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో...
28-10-2020
Oct 28, 2020, 18:50 IST
దుబాయ్‌ : ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌, స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ వెస్టీండీస్‌ క్రికెటర్‌ మార్లన్ శామ్యూల్స్ పై ట్విటర్‌ వేదికగా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top