టి20 ప్రపంచకప్‌ 2021: విజేత ఎవరో చెప్పిన పీటర్సన్‌

Kevin Pietersen Predicts T20 World Cup 2021 Final Winner - Sakshi

Kevin Pieterson Predicts Winner Of T20 World Cup 2021: టి20 ప్రపంచకప్‌ 2021 విజేతపై ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఆస్ట్రేలియా ఫెవరెట్‌గా కనిపిస్తుందని.. కచ్చితంగా కప్‌ కొడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇదే విషయమై పీటర్సన్‌ తన బ్లాగ్‌లో ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.

చదవండి: T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్‌.. కాన్వే స్థానంలో ఎవరంటే

''న్యూజిలాండ్‌ ప్రస్తుతం అన్ని  విభాగాల్లో(బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌) బలంగా కనిపిస్తోంది. కానీ ఆస్ట్రేలియానే నా ఫెవరెట్‌. ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లు ఫైనల్లో ఎదురుపడినప్పుడు ఆస్ట్రేలియా దుమ్మురేపిందని చరిత్ర చెబుతుంది. 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో జరిగింది ఇదే. ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరితే బలంగా తయారవుతోంది.. అది ప్రత్యర్థి జట్టుకు ఒత్తిడిగా మారుతోంది. ఈ ఆదివారం ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్‌ను ఎత్తడం ఖాయం. ఇక డేవిడ్‌ వార్నర్‌ మంచి ఫామ్‌లో ఉండడం న్యూజిలాండ్‌కు ప్రమాదం.

ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున తీవ్రంగా నిరాశపరిచిన వార్నర్‌ అక్కడ మరిచిపోయిన ఫామ్‌ను..కోపాన్ని ఈ టి20 ప్రపంచకప్‌లో చూపిస్తున్నాడు. అతనికి తోడూ గత మ్యాచ్‌లో వేడ్‌, స్టోయినిస్‌లు అద్భుతం చేసి చూపించారు.ఆస్ట్రలియా జట్టు పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ఏలారు. తాజాగా టి20 ప్రపంచకప్‌ను గెలిస్తే ఇకపై టి20ల్లోనూ తమ బలాన్ని చూపించే అవకాశం ఉంది'' అంటూ తెలిపాడు.

చదవండి: T20 WC 2021: పాపం కివీస్‌.. టి20 ప్రపంచకప్‌ కొట్టినా నెంబర్‌వన్‌ కాకపోవచ్చు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top