బ్రేకింగ్‌: కపిల్‌దేవ్‌కు గుండెపోటు | Kapil Dev Joins In Hospital With Heart Attack | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌ : కపిల్‌దేవ్‌కు గుండెపోటు

Oct 23 2020 2:33 PM | Updated on Oct 23 2020 7:10 PM

Kapil Dev Joins In Hospital With Heart Attack - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు గుండె ఆపరేషన్‌ చేశారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు ప్రకటించారు. తాజా వార్తల నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కపిల్‌ త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేస్తున్నారు. హర్యానా హరికేన్‌గా పేరొందిన కపిల్‌ సారథ్యంలోనే భారత జట్టు 1983లో వన్డే ప్రపంచ కప్‌ను తొలిసారి కైవసం చేసుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement