దక్షిణాఫ్రికా వన్డే జట్టులో రబడ పునరాగమనం

Kagiso Rabada returns to South Africa squad for ODI and T20I series against England - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: ఇంగ్లండ్‌తో వచ్చే నెలలో జరిగే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. స్టార్‌ పేస్‌ బౌలర్‌ కగిసో రబడ పునరాగమనం చేశాడు. గత మార్చిలో భారత్‌తో జరిగిన సిరీస్‌కు గాయంతో రబడ దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న రబడ ఐపీఎల్‌ టి20 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 15 మ్యాచ్‌ల్లో ఆడిన రబడ 25 వికెట్లు తీశాడు. 24 మంది సభ్యులతో ప్రకటించిన ప్రస్తుత జట్టులో పేస్‌ బౌలర్‌ స్టర్‌మన్‌కు తొలిసారి స్థానం లభించింది.  

దక్షిణాఫ్రికా వన్డే జట్టు: డికాక్‌ (కెప్టెన్‌), బవుమా, డాలా, డు ప్లెసిస్, ఫార్చూన్, బ్యూరన్‌ హెన్‌డ్రిక్స్, రీజా హెన్‌డ్రిక్స్, క్లాసెన్, జార్జి లిండె, కేశవ్‌ మహరాజ్, మలాన్, మిల్లర్, ఇన్‌గిడి, నోర్జే, ఫెలుక్వాయో, ప్రెటోరియస్, రబడ, షమ్సీ, సిపామ్లా, స్మట్స్, స్టర్‌మన్, బిల్జాన్, డుసెన్, వెరియన్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top