Julius Baer Generation Cup: ఫైనల్లో అర్జున్‌ | Julius Baer Generation Cup: Arjun Erigaisi To Play In Generation Cup Final | Sakshi
Sakshi News home page

Julius Baer Generation Cup: ఫైనల్లో అర్జున్‌

Sep 25 2022 4:50 AM | Updated on Sep 25 2022 4:50 AM

Julius Baer Generation Cup: Arjun Erigaisi To Play In Generation Cup Final - Sakshi

న్యూయార్క్‌: జూలియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ అంతర్జాతీయ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో భారత యువతార, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ జోరు కొనసాగుతోంది. వరంగల్‌ జిల్లాకు చెందిన 19 ఏళ్ల అర్జున్‌ ఈ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. లియెమ్‌ క్వాంగ్‌ లీ (వియత్నాం)తో జరిగిన సెమీఫైనల్లో అర్జున్‌ 4–2తో గెలిచాడు.

నిర్ణీత నాలుగు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 2–2తో సమంగా నిలువడంతో రెండు టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించారు. రెండు టైబ్రేక్‌ గేముల్లో అర్జున్‌ విజయం సాధించాడు. టైటిల్‌ కోసం ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో అర్జున్‌ తలపడతాడు. వీరిద్దరి మధ్య రెండు రోజులపాటు నాలుగు గేమ్‌లతో కూడిన రెండు ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. 

Advertisement
 
Advertisement
Advertisement