ENG vs SA: దక్షిణాఫ్రికా గడ్డపై అర్చర్‌ సరికొత్త చరిత్ర.. 30 ఏళ్ల రికార్డు బద్దలు

Jofra Archer broke this thirty year old record of Wasim Akram - Sakshi

దక్షిణాఫ్రికా గడ్డపై ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోప్రా అర్చర్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికాలో ప్రోటీస్‌ జట్టుపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా అర్చర్‌ నిలిచాడు. కింబర్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో అర్చర్‌ దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో 9.1 ఓవర్లు బౌలింగ్‌ చేసిన జోఫ్రా.. 40 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

తద్వారా ఈ అరుదైన ఘనతను అర్చర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్తాన్‌ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట ఉండేది. 1993లో దక్షిణాఫ్రికాలో ప్రోటీస్‌తో జరిగిన ఓ వన్డేలో అక్రమ్ 16 పరుగులకే 5 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో 30 ఏళ్ల అక్రమ్‌ రికార్డును అర్చర్‌ బ్రేక్‌ చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రెండో మ్యాచ్‌లోనే అర్చర్‌ ఈ ఘనత సాధించడం విశేషం. ఇక అర్చర్‌కు వన్డేల్లో ఇదే కెరీర్‌ బెస్ట్‌ కూడా.

తొలి ఇంగ్లండ్‌ బౌలర్‌గా..
అదే విధంగా విదేశీ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి ఇంగ్లండ్‌ బౌలర్‌గా అతడు నిలిచాడు.అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ క్రిస్ వోక్స్‌ పేరిట ఉండేది. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో క్రిస్ వోక్స్‌ 45 పరుగులిచ్చి 6 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌లో 40 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన అర్చర్‌.. 12 ఏళ్ల వోక్స్‌ రికార్డు బ్రేక్‌ చేశాడు.
చదవండిIND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top