#JiteshSharma: పంజాబ్‌ తరపున కొత్త సిక్సర్ల వీరుడు | Jitesh Sharma 21 Sixes Most Sixes For Punjab Kings This IPL 2023 Season | Sakshi
Sakshi News home page

#JiteshSharma: పంజాబ్‌ తరపున కొత్త సిక్సర్ల వీరుడు

May 19 2023 9:22 PM | Updated on May 19 2023 10:03 PM

Jitesh Sharma 21 Sixes Most Sixes For Punjab Kings This IPL 2023 Season - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్‌ ఆడినంతసేపు ఎక్కువగా సిక్సర్లకే ప్రాధాన్యమిచ్చిన జితేశ్‌ ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం(మే 19న) రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో 28 బంతుల్లో 44 పరుగులు చేసిన జితేశ్‌ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.


Photo: IPL Twitter

కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు జితేశ్‌ శర్మ 21 సిక్సర్లు బాదాడు. పంజాబ్‌ కింగ్స్‌ తరపున సీజన్‌లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా నిలిచాడు. జితేశ్‌ శర్మ తర్వాత లియామ్‌ లివింగ్‌స్టోన్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 19 సిక్సర్లతో ఉన్నారు.

ఇక ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున జితేశ్‌ శర్మ మూడో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 14 మ్యాచ్‌ల్లో 309 పరుగులు చేశాడు. ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే జితేశ్‌ ఖాతాలో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. సీజన్‌లో అతని అత్యధిక స్కోరు 49 నాటౌట్‌గా ఉంది.

చదవండి: స్థిరత్వం లేని బ్యాటింగ్‌.. పైగా వెకిలి నవ్వొకటి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement