మరో ‘మంకీ’ వివాదం– సిరాజ్, బుమ్రాలను దూషించిన ప్రేక్షకులు | Jasprit Bumrah and Mohammad Siraj Face Racial Abuse at Sydney | Sakshi
Sakshi News home page

మరో ‘మంకీ’ వివాదం– సిరాజ్, బుమ్రాలను దూషించిన ప్రేక్షకులు

Jan 10 2021 6:12 AM | Updated on Jan 10 2021 6:12 AM

Jasprit Bumrah and Mohammad Siraj Face Racial Abuse at Sydney - Sakshi

మూడో టెస్టు సందర్భంగా అనూహ్య వివాదం చోటు చేసుకుంది. మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తున్న ఇద్దరు భారత క్రికెటర్లు బుమ్రా, సిరాజ్‌లపై స్టేడియంలోని ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు.  ఆసీస్‌ అభిమాని ఒకరు సిరాజ్‌ను ‘మంకీ’గా సంబోధించినట్లు తెలిసింది. 2007–08 సిరీస్‌లో ఇదే మైదానంలో జరిగిన ‘మంకీ గేట్‌’ ఉదంతాన్ని ఇది గుర్తు చేసింది. దీనిపై మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌కు బీసీసీఐ అధికారికంగా ఫిర్యాదు చేసింది. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత సెక్యూరిటీ అధికారులు, అంపైర్లతో భారత బృందం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఐసీసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement