WTC FINAL 2023: కిషన్‌ కంటే అతడు చాలా బెటర్‌.. ఎందుకు సెలక్ట్‌ చేశారో అర్ధం కావడం లేదు!

Ishan Kishan will be vulnerable in English conditions:  - Sakshi

ఆస్ట్రేలియాతో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు  భారత జట్టులో యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. గాయపడిన కేఎల్‌ రాహుల్‌ స్థానంలో కిషన్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అయితే కిషన్‌ ఎంపికపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది సెలక్టర్లు నిర్ణయాన్ని సమర్థిస్తుంటే,మరి కొంత మంది తప్పుబడుతున్నారు.

ఇక ఇదే విషయంపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ టామ్ మూడీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇషాన్ కిషన్‌కు ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని మూడీ తెలిపాడు. కిషన్‌ను కాకుండా అనుభవజ్ఞుడైన వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇచ్చే ఉంటే బాగుండేది అని మూడీ అన్నారు. "రాహుల్‌ స్థానంలో కిషన్‌ ఎందుకు ఎంపిక చేశారో అర్ధం కావడం లేదు. కిషన్‌ కంటే వృద్ధిమాన్ సాహా చాలా బెటర్‌. సాహాకు 15 ఏళ్ల అనుభవం ఉంది.

అటువంటి ఆటగాడిని  డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తీసుకువెళ్లాల్సింది. ఇంగ్లండ్‌ పిచ్‌లకు ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఇంగ్లండ్‌ వంటి పరిస్థితుల్లో కిషన్‌ ఆడటానికి చాలా ఇబ్బంది పడతాడు. విదేశీ గడ్డపై పెద్దగా ఆడిన అనుభం కూడా అతడికి లేదు. అదే విధంగా సాహా జట్టులో ఉంటే ఏడు లేదా ఎనిమిదో స్థానంలో నైనా బ్యాటింగ్‌కు వచ్చి ఆడగలడు. కానీ కిషన్‌ మాత్రం టాపర్డర్‌లో మాత్రమే ఆడగలడు. అటువంటి అప్పుడు  కిషన్‌ ఎంపిక చేసి ఏమి లాభం" అని ఈఎస్‌ప్పీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్‌ మూడీ పేర్కొన్నాడు.
చదవండి: PBKS VS KKR: పంజాబ్‌ ఓడినా, అర్షదీప్‌ గెలిచాడు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top