సచిన్‌ను చూసాక ఇషాన్‌ కిషన్‌ రియాక్షన్‌.. నవ్వు ఆపుకోలేకపోయిన పొలార్డ్‌ | Ishan Kishan Reaction After Seeing Sachin Tendulkar In MI Dressing Room Gone Viral | Sakshi
Sakshi News home page

Viral Video: సచిన్‌ను చూసాక ఇషాన్‌ కిషన్‌ రియాక్షన్‌.. నవ్వు ఆపుకోలేకపోయిన పొలార్డ్‌

Oct 1 2021 6:10 PM | Updated on Oct 1 2021 6:47 PM

Ishan Kishan Reaction After Seeing Sachin Tendulkar In MI Dressing Room Gone Viral - Sakshi

Ishan Kishan Reaction After Seeing Sachin Tendulkar In MI Dressing Room: ఇపీఎల్‌-2021 సెకెండ్‌ ఫేస్‌లో భాగంగా ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటన నెటిజన్లను తెగ నవ్వించేస్తుంది. ఓ మ్యాచ్‌కు ముందు దిగ్గజ క్రికెటర్, ముంబై ఇండియన్స్‌ మెంటార్‌ సచిన్ టెండుల్కర్‌ను సడెన్‌గా చూసాక ఆ జట్టు స్టార్‌ ఆటగాడు ఇషాన్ కిషన్ ఇచ్చిన రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తూ విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓ మ్యాచ్‌కు ముందు ఇషాన్‌ హోటల్‌ గది నుంచి బయల్దేరుతూ.. బ్లాక్‌ సన్‌ గ్లాసస్‌.. చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకొని క్యాజువల్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చాడు. 

అక్కడ అప్పటికే టీమ్ మెంటార్  సచిన్ కూర్చొని ఉన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో సడెన్‌గా సచిన్‌ను చూసిన ఇషాన్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. క్లాస్‌ రూమ్‌లో ప్రిన్సిపల్‌ను చూసి స్టుడెంట్స్ భయపడినట్లు.. బ్యాగ్‌, సన్‌ గ్లాసస్‌, ఇయర్‌ బడ్స్‌ను తీసేసి జట్టును సర్దుకుని గుడ్‌ ఆఫ్టర్‌ నూన్‌ సార్‌.. అంటూ వినయాన్ని ప్రదర్శించాడు. ఇది చూసిన సహచర క్రికెటర్లు నవ్వుల్లో మునిగిపోయారు. పక్కనే ఉన్న పోలార్డ్‌, జయంత్‌ యాదవ్‌ అయితే.. ఇషాన్‌ హావభావాలు చూసి నవ్వు ఆపుకోలేక బిగ్గరగా నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

ఇదిలా ఉంటే, గడిచిన ఐపీఎల్‌ సీజన్లలో అదరగొట్టి టీమిండియా టీ20 ప్రపంచకప్‌ జట్టులో సైతం చోటు దక్కించుకున్న ఇషాన్‌ కిషన్.. ప్రస్తుత సీజన్‌లో ఫామ్ కోల్పోయాడు. ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 13.38 సగటున కేవలం 107 పరుగులు మాత్రమే సాధించాడు. మరోవైపు సహచర క్రికెటర్‌, టీ20 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్ సైతం ఇషాన్‌లాగే ఫామ్‌ లేమితో సతమతమవుతున్నాడు. ఈ విషయం టీమిండియాను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఈ ఇద్దరిపై వేటు వేసి శ్రేయస్ అయ్యర్‌, శిఖర్‌  ధవన్‌లకు ఎంపిక చేయాలన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. 
చదవండి: స్టార్‌ ఫుట్‌బాలర్‌కు చేదు అనుభవం.. హోటల్‌ గదిలోకి చొరబడి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement