రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ ఆల్‌ రౌండర్‌..

Ireland All Rounder Kevin O Brien Retires From ODI Cricket - Sakshi

డబ్లిన్‌: ఐర్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కెవిన్ ఒబ్రెయిన్(37) వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఐర్లాండ్‌కు 15ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పి, టెస్టు, టీ20 ఫార్మాట్లలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. వన్డే క్రికెట్‌పై ఆసక్తి తగ్గిందని, అందుకే ఆ ఫార్మాట్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాని ఆయన పేర్కొన్నాడు. రిటైర్మెంట్‌ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను అని ఒబ్రెయిన్‌ వివరించాడు.

2006లో అరంగేట్రం చేసిన కెవిన్‌ 153 వన్డేల్లో 3,618 పరుగులతో పాటు 114 వికెట్లను పడగొట్టాడు. ఐర్లాండ్‌ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్ల రికార్డు అతని పేరిటే ఉంది. భారత్‌ ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే ప్రపంచకప్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన కెవిన్‌.. అనంతరం స్టార్‌ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ఆ వరల్డ్‌కప్‌లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెవిన్‌.. పెను విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 50 బంతుల్లోనే 100 పరుగుల మార్క్‌ చేరుకుని, రికార్డు శతకాన్ని నమోదు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు.

ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 327 పరుగులు చేయగా,  అనంతరం ఛేదనలో ఒబ్రెయిన్‌(113 రన్స్‌) మెరుపు సెంచరీ సాధించడంతో పసికూన ఐర్లాండ్‌ సంచలన విజయం సాధించింది. నాటికి వన్డే ప్రపంచకప్‌లో కెవిన్‌దే అత్యంత వేగవంతమైన శతకంగా నిలిచింది.
చదవండి: క్రికెట్‌ను ఆటగా కాకుండా మతంలా మార్చిన ఆ ఇన్నింగ్స్‌కు 38 ఏళ్లు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top