ఈసారి ఐపీఎల్‌ వేలంలో నా పేరు చూడబోతున్నా | IPL: David Warner Confirms He Will Put His Name Mega Auction | Sakshi
Sakshi News home page

ఈసారి ఐపీఎల్‌ వేలంలో నా పేరు చూడబోతున్నా

Oct 28 2021 7:53 PM | Updated on Oct 28 2021 7:56 PM

IPL: David Warner Confirms He Will Put His Name Mega Auction - Sakshi

David Warner Confirms Name In IPL Mega Auction.. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌ మెగా వేలంలో  తన పేరును చూస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్‌ 2021 సీజన్‌లో వార్నర్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాటర్‌గాను వార్నర్‌ పెద్దగా రాణించలేకపోయాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక కరోనా విరామం తర్వాత మొదలైన ఐపీఎల్‌ సెకండ్‌ఫేజ్‌లో వార్నర్‌ కేవలం ఒక్క మ్యాచ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఆ తర్వాత డగౌట్‌కే పరిమితం కావడం.. ఆ తర్వాత జట్టుతో కలిసి కూర్చోకపోవడం.. క్రమేపీ దూరమవ్వడం స్పష్టంగా కనిపించింది. దీంతో వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ను వదిలి వేరే జట్టులో చేరబోతున్నట్లుగా సంకేతాలు అందాయి.

తాజాగా టి20 ప్రపంచకప్‌ 2021 నేపథ్యంలో యూఏఈలోనే ఉన్న వార్నర్‌ స్పందించాడు. '' ఈసారి వేలంలో నా పేరును చూడాలనుకుంటున్నా. ఎస్‌ఆర్‌హెచ్‌ నన్ను ఎలాగో రిటైన్‌ చేసుకోదు కాబట్టి కచ్చితంగా వేలంలోకి వస్తా. ఈసారి కొత్త జట్టుతో చేరి ఫ్రెష్‌గా ఐపీఎల్‌ సీజన్‌ను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నా.''  అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ENG Vs BAN: కన్‌ఫ్యూజ్‌ రనౌట్‌.. ఇంగ్లండ్‌ ఆటగాడి డ్యాన్స్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement