IPL 2023 PBKS Vs KKR: డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో కేకేఆర్‌పై పంజాబ్‌ కింగ్స్‌ విజయం

IPL 2023 PBKS Vs KKR Playing XI Updates And Highlights - Sakshi

PBKS Vs KKR Playing XI Updates And Highlights: 
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ వర్షం పడే సమయానికి 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి అమలు చేశారు. ఈ లెక్కన కేకేఆర్‌ ఏడు పరుగులు వెనుకబడి ఉంది. దీంతో పంజాబ్‌ మ్యాచ్‌ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. 

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్‌ ధావన్‌ 40 రాణించాడు. చివర్లో సామ్‌ కరన్‌ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్‌, షారుక్‌ ఖాన్‌ ఏడు బంతుల్లో 11 పరుగులు నాటౌట్‌ దాటిగా ఆడారు. కేకేఆర్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌లు తలా క వికెట్‌ తీశారు.

మ్యాచ్‌కు వర్షం అంతరాయం
మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ‍ ప్రస్తుతం కేకేఆర్‌ 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం కేకేఆర్‌ ఏడు పరుగులు వెనుకబడి ఉంది. ఒకవేళ మ్యాచ్‌ జరగకపోతే పంజాబ్‌దే విజయం

ఎదురీదుతున్న కేకేఆర్‌..
► 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్‌ను రసెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ ఐదు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ 32, రసెల్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. కేకేఆర్‌ విజయానికి 36 బంతుల్లో 74 పరుగులు కావాలి.

80 పరుగులకే ఐదు వికెట్లు
► పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 4 పరుగులు చేసిన రింకూ సింగ్‌ రాహుల్‌ చహర్‌ బౌలింగ్‌లో సికందర్‌ రజాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ 21 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

29కే మూడు వికెట్లు.. కష్టాల్లో కేకేఆర్‌
► 192 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్‌ కష్టాల్లో పడింది. 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పంజాబ్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు.  ప్రస్తుతం కేకేఆర్‌ ఆరు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. నితీష్‌ రాణా 7 పరుగులు, వెంకటేశ్‌ అయ్యర్‌ 10 పరుగులు క్రీజులో ఉన్నారు.

కేకేఆర్‌ టార్గెట్ 192
► కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్‌ ధావన్‌ 40 రాణించాడు. చివర్లో సామ్‌ కరన్‌ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్‌, షారుక్‌ ఖాన్‌ ఏడు బంతుల్లో 11 పరుగులు నాటౌట్‌ దాటిగా ఆడారు. కేకేఆర్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌లు తలా క వికెట్‌ తీశారు.


Photo Credit : IPL Website

16 ఓవర్లలో పంజాబ్‌ 153/4
► కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ ధాటిగా ఆడుతుంది. 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సికందర్‌ రజా 13, సామ్‌ కరన్‌ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రాజపక్స 50, ధావన్‌ 40 పరుగులతో రాణించారు.

మూడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
► కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జితేశ్‌(21) రూపంలో మూడో వికెట్‌ కోల్పోయింది. అంతకముందు రాజపక్స 50 పరుగులు చేసిన వెంటనే ఔటయ్యాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది, ధావన్‌ 40, సికందర్‌ రజా ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు.


Photo Credit : IPL Website

10 ఓవర్లలోనే వంద మార్క్‌ దాటిన పంజాబ్‌
►కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ ధాటిగా ఆడుతుంది. 10 ఓవర్లలోనే జట్టు స్కోరు వికెట్‌ నష్టానికి వంద పరుగుల మార్క్‌ దాటింది. రాజపక్స 46 పరుగులు, ధావన్‌ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు.


Photo Credit : IPL Website

ధాటిగా ఆడుతున్న రాజపక్స​.. ఏడు ఓవర్లలో పంజాబ్‌ 69/1
► ఏడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ వికెట్‌ నష్టానికి 69 పరుగులు చేసింది. బానుక రాజపక్స 18 బంతుల్లో 31 పరుగులతో ధాటిగా ఆడుతుండగా.. శిఖర్‌ ధావన్‌ 15 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు.


Photo Credit : IPL Website

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
►టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్‌ సింగ్‌.. సౌథీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 2 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 23/1

ఐపీఎల్‌-2023లో మరో ఆసక్తికర పోరుకు సమయం అసన్నమైంది. మొహాలీ వేదికగా రెండో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కేకేఆర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కాగా తొలిసారి కేకేఆర్‌కు నితీష్‌ రాణా సారథ్యం వహిస్తుండగా.. శిఖర్‌ ధావన్‌కు పంజాబ్‌ కెప్టెన్సీ ఇదే మొదటి సారి.

తుది జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: మన్‌దీప్ సింగ్, రహమానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), నితీష్ రాణా (కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్‌), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్
చదవండి:
 IPL 2023: ప్లీజ్‌.. అతడిని తప్పించండి! ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు! ఆ ‘మహానుభావుడేమో’..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top