Gill No Ball Contoversy : గిల్‌ ఔట్‌పై అప్పీల్‌.. నో బాల్‌ ఇవ్వడం వెనుక అసలు కథ!

IPL 2022 Shubman Gill DRS Referral Caught Behind Anuj Rawat Given No-ball - Sakshi

ఐపీఎల్‌ 2022లో శనివారం గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. గుజరాత్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఔట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ నో బాల్‌ డిక్లేర్‌ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. విషయంలోకి వెళితే.. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ షాబాజ్‌ అహ్మద్‌ వేశాడు. అప్పటికే గిల్‌ 24 పరుగులతో టచ్‌లో కనిపించాడు. అయితే షాబాజ్‌ వేసిన నాలుగో బంతిని షాట్‌ ఆడే ప్రయత్నంలో గిల్‌ మిస్‌ చేశాడు. బంతి వెళ్లి సబ్‌స్టిట్యూట్‌ కీపర్‌ అనూజ్‌ రావత్‌ చేతిలో పడింది. క్యాచ్‌ ఔట్‌గా అనూజ్‌ అంపైర్‌కు అప్పీల్‌ చేశాడు.


Courtesy: IPL Twitter
ఫీల్డ్‌ అంపైర్‌ కూడా తాకిందేమోనని ఔట్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. వెంటనే గిల్‌ డీఆర్‌ఎస్‌ కోరాడు. అయితే అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌ను ఎక్కడ తగల్లేదని థర్డ్‌ అంపైర్‌ పరిశీలనలో తేలింది. ఔటివ్వకపోగా థర్డ్‌ అంపైర​ నోబాల్‌ ప్రకటించాడు. ఈ నిర్ణయం విన్న ఆర్‌సీబీ ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. కోహ్లి ఫీల్డ్‌ అంపైర్‌ వద్దకు వచ్చి నోబాల్‌ ఎందుకని అడిగాడు. వాస్తవానికి అనూజ్‌ రావత్‌ క్యాచ్‌ పట్టడానికి ముందే గ్లోవ్స్‌ స్టంప్‌ లైన్‌ మీదకు వచ్చాయి. క్రికెట్‌ లా ప్రకారం.. బంతిని బ్యాట్స్‌మన్‌ ఆడడానికి ముందే కీపర్‌ ఉద్దేశపూర్వకంగా గ్లోవ్స్‌ను స్టంప్స్‌ వద్దకు తీసుకొస్తే దానిని నోబాల్‌గా పరిగణిస్తారు. ఇదే రూల్‌ను అనూజ్‌ రావత్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ అప్లై చేశారు. కాగా ఫ్రీహిట్‌ను భారీ సిక్స్‌ సంధించిన గిల్‌.. అదే ఓవర్‌లో ఐదో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు.  

ఎంసీసీ రూల్స్‌లో ఏం ఉందంటే..
ఎంసీసీ(మెరిల్‌బోర్న్‌ క్రికెట​ క్లబ్‌) రూల్స్‌లో లా 27.3.1, లా 27.3.2ను అనూజ్‌ రావత్‌ ఉల్లఘించినట్లు తేలింది. లా 27.3.1 ప్రకారం బౌలర్‌ బంతి వేయడానికి ముందు.. లేక బ్యాట్స్‌మన్‌ బంతిని టచ్‌ చేయడానికి ముందు.. లేదా బంతి బ్యాటర్‌ బ్యాట్‌ను తాకి స్టంప్స్‌ను దాటి వెళ్లడానికి ముందు కీపర్‌ స్టంప్స్‌ దగ్గరకు రాకూడదని ఈ నిబంధన  పేర్కొంటుంది. ఇక లా 27.3.2 ప్రకారం బంతి బ్యాట్స్‌మన్‌ బ్యాట్‌ను తాకడానికి ముందే వికెట్‌ కీపర్‌ ఉద్దేశపూర్వకంగా స్టంప్స్‌ దగ్గరకు వస్తే అంపైర్‌కు నో బాల్‌ ఇచ్చే అధికారం ఉంటుంది. 

చదవండి: IPL 2022: రోహిత్‌ విఫలం‌.. రితికాను ఓదార్చిన అశ్విన్‌ భార్య

గిల్‌ నోబాల్‌ వివాదంపై వీడియో కోసం క్లిక్‌ చేయండి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top