Russell-Sam Billings: 'రసెల్‌తో బ్యాటింగ్‌ అంటే నాకు ప్రాణ సంకటం'

IPL 2022 Sam Billings Says I-Feared Batting Andre Russell Vs Punjab Kings - Sakshi

కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో తన విశ్వరూపం చూపెట్టాడు. కష్టాల్లో పడిన జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. 31 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 70 పరుగులతో సునామీ ఇన్నింగ్స్‌ను తలపించాడు. అతని దాటికి కేకేఆర్‌ 138 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే చేధించింది. ఓడియన్‌ స్మిత్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో రసెల్‌ విశ్వరూపాన్నే చూపించాడు. మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌, నోబాల్‌ సహా మొత్తం 24 పరుగులు పిండుకోగా.. అదే ఓవర్‌ ఆఖరి బంతిని సామ్‌ బిల్లింగ్స్‌ సిక్సర్‌ సంధించడంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి. కాగా మ్యాచ్‌లో రసెల్‌ విధ్వంసాన్ని కళ్లారా ఆస్వాధించిన సామ్‌ బిల్లింగ్స్‌ 24 పరుగులు నాటౌట్‌గా నిలిచి అతనికి సహకరించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం సామ్‌ బిల్లింగ్స్‌ రసెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

''రసెల్‌ విధ్వంసాన్ని దగ్గరుండి చేశాను.  ఒక విధ్వంసకర ఆటగాడు ఫామ్‌లో ఉంటే మనం సపోర్ట్‌ చేయడం తప్ప ఇంకేం చేయలేము. పవర్‌ హిట్టింగ్‌లో అతన్ని మించినవారు లేరని మరోసారి నిరూపించాడు. కొన్నిసార్లు రసెల్‌ విధ్వంసం చూసి.. అతనితో కలిసి ఆడాలంటే నాకు ప్రాణ సంకటంగా అనిపించేది. కానీ నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో నుంచి రసెల్‌ ఇన్నింగ్స్‌ను ఆస్వాధించాను. వాస్తవానికి 51 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు.. రసెల్‌ ఒక మాట చెప్పాడు. వికెట్లు పోయాయని కంగారుపడొద్దు.. పోరాడుదాం.. ఫలితం మనకు అనుకూలంగా వస్తుంది. మా హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ కూడా రసెల్‌కు ఇదే విషయాన్ని చెప్పి పంపాడు.'' అంటూ తెలిపాడు. 

చదవండి: IPL 2022: పంజాబ్‌ బౌలర్‌కు చుక్కలు చూపించిన రసెల్‌

IPL 2022: పగ తీర్చుకున్న కేకేఆర్‌ బౌలర్‌.. వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top