IPL 2022: RCB Glenn Maxwell Hopes MI Can Defeat Delhi In Last Match, Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2022 Glenn Maxwell: ముంబై.. ఢిల్లీని ఓడించాలి! మేము ఫైనల్‌ ఆడాలి! టైటిల్‌ గెలవాలి!

May 20 2022 4:52 PM | Updated on May 20 2022 6:05 PM

IPL 2022: RCB Glenn Maxwell Hopes MI Can Defeat Delhi In Last Match Why - Sakshi

ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌(PC: IPL/BCCI)

ఢిల్లీపై ముంబై విజయం సాధించాలని కోరుకున్న గ్లెన్‌ మాక్స్‌వెల్‌

IPL 2022 Playoffs: ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియన్స్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ తప్పక గెలవాలని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరులో ముంబై విజయం సాధించాలని కోరుకున్నాడు. కాగా గుజరాత్‌ టైటాన్స్‌పై గురువారం(మే 19) నాటి విజయంతో ఆర్సీబీ తమ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకున్న విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్‌లో 28 పరగులు ఇచ్చిన మాక్సీ ఒక వికెట్‌ పడగొట్టాడు. మాథ్యూవేడ్‌ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బ్యాటింగ్‌లోనే ఈ ఆసీస్‌ ప్లేయర్‌ సత్తా చాటాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మాక్స్‌వెల్‌ 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా ఆర్సీబీ గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో విజయంతో ఆర్సీబీ మొత్తంగా 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్‌ రేసులో బెంగళూరుకు గట్టి పోటీనిస్తున్న ఢిల్లీ.. తమ ఆఖరి మ్యాచ్‌లో ముంబైతో తలపడనుంది. ఇందులో పంత్‌ సేన ఓడితేనే ఆర్సీబీ టాప్‌-4లో నిలుస్తుంది.

ఈ నేపథ్యంలో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మాట్లాడుతూ.. ‘‘మేము కోల్‌కతా వెళ్లడం.. ఆపై ఫైనల్‌ ఆడాలని ఎంతో ఉత్సుకతో ఎదురుచూస్తున్నాం. తద్వారా మేము టైటిల్‌ గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నా. ఇదంతా జరగాలంటే ముందు ముంబై.. ఢిల్లీని ఓడించాలి’’ అని ఆశించాడు. రిషభ్‌ పంత్‌ సేన పరాజయం పాలైతే బాగుంటుందని కోరుకున్నాడు.

ఇక కొత్త జట్లు గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారు చేసుకోగా.. పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌ సైతం దాదాపుగా అర్హత సాధించింది. నాలుగో స్థానం కోసం ఆర్సీబీ, ఢిల్లీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఐపీఎల్‌ మ్యాచ్‌ 67: ఆర్సీబీ వర్సెస్‌ గుజరాత్‌ స్కోర్లు
గుజరాత్‌- 168/5 (20)
ఆర్సీబీ- 170/2 (18.4)
8 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం

చదవండి👉🏾RCB Beat GT: ఆర్సీబీ విజయంతో ఆ 2 జట్లు అవుట్‌.. ఇక ఢిల్లీ గెలిచిందో అంతే సంగతులు!
చదవండి👉🏾IPL 2022 RR Vs CSK: సీఎస్‌కే తుదిజట్టులో అతడిని చూడాలని ఉంది.. ధోని ఒక్క ఛాన్స్‌ ఇస్తే!

1457570

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement