IPL 2022: పంజాబ్‌ బల్లే బల్లే...

IPL 2022: Punjab Kings Beat Royal Challengers Bangalore by 54 runs - Sakshi

కీలక విజయం సాధించిన కింగ్స్‌

54 పరుగులతో బెంగళూరు ఓటమి

ముంబై: ‘ప్లే ఆఫ్స్‌’ చేరే అవకాశాలు దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్న దశలో పంజాబ్‌ కింగ్స్‌ కీలక విజయంతో మళ్లీ రేసులోకి వచ్చింది. ఏకపక్ష పోరులో బెంగళూరును చిత్తు చేసి ఆశలు నిలబెట్టుకుంది. మరోవైపు ముందంజ వేసేందుకు చేరువైన స్థితిలో ఈ భారీ పరాజయం ఆర్‌సీబీకి నష్టం కలిగించనుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 54 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది.

ముందుగా పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ (42 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెయిర్‌స్టో (29 బంతుల్లో 66; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా, హర్షల్‌ పటేల్‌ (4/34) రాణించాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (22 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... రబడ (3/21) రాణించాడు.

మెరుపు బ్యాటింగ్‌...
71 బంతుల్లో 136 పరుగులు... పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌ పాత్ర ఇది! మిగతా బ్యాటర్లంతా విఫలమైనా... ఈ ఇద్దరి దూకుడైన బ్యాటింగ్‌ కారణంగానే కింగ్స్‌ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. ఆరంభంలో బెయిర్‌స్టో చెలరేగగా, ఆ తర్వాత లివింగ్‌స్టోన్‌ బాధ్యత తీసుకున్నాడు. హాజల్‌వుడ్‌ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన బెయిర్‌స్టో, సిరాజ్‌ ఓవర్లో 3 భారీ సిక్స్‌లు, ఒక ఫోర్‌తో దూసుకుపోయాడు.

21 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తి కాగా, 8.5 ఓవర్లలోనే స్కోరు 100 పరుగులకు చేరింది. శిఖర్‌ ధావన్‌ (21), రాజపక్స (1), మయాంక్‌ (19), జితేశ్‌ (9) విఫలమైనా లివింగ్‌స్టోన్‌ జోరు కొనసాగించాడు. షహబాజ్‌ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 కొట్టిన అతను హాజల్‌వుడ్‌ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో పండగ చేసుకున్నాడు. 35 బంతుల్లో అతను హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. హాజల్‌వుడ్‌ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌ చరిత్రలో బెంగళూరు తరఫున అత్యంత చెత్త బౌలింగ్‌ గణాంకాలు (0/64) నమోదు చేశాడు.  

సమష్టి వైఫల్యం...
ఛేదనలో బెంగళూరు పూర్తిగా తడబడింది. ఆరంభంలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన కోహ్లి (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్‌), డుప్లెసిస్‌ (10) ఒక పరుగు తేడాతో వెనుదిరగడంతో జట్టు పతనం మొదలైంది. లోమ్రోర్‌ (6) విఫలం కాగా, పటిదార్‌ (21 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొద్దిసేపు పట్టుదల కనబర్చాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌ ఉన్నంత వరకు ఆర్‌సీబీ గెలుపుపై కాస్త ఆశలు పెట్టుకుంది. అయితే అతనితో పాటు దినేశ్‌ కార్తీక్‌ (11) కూడా తక్కువ వ్యవధిలో అవుట్‌ కావడంతో జట్టు వేగంగా ఓటమి దిశగా పయనించింది.

ఐపీఎల్‌లో నేడు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ X కోల్‌కతా నైట్‌రైడర్స్‌
వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-05-2022
May 14, 2022, 08:33 IST
ఆర్‌సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి భారీ స్కోరు చేయడంలో మరోసారి విఫలమయ్యాడు. అసలే గోల్డెన్‌ డక్‌లతో ఇబ్బంది పడుతున్న...
14-05-2022
May 14, 2022, 07:58 IST
పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ కగిసో రబాడ టి20 క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. శుక్రవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో హర్షల్‌...
13-05-2022
May 13, 2022, 22:57 IST
ఐపీఎల్‌-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్వాలేదనిపిస్తుంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ ఏడు విజయాలు సాధించి పాయింట్ల...
13-05-2022
May 13, 2022, 20:23 IST
ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్పీడ్‌గన్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. కాగా మాలిక్‌ను భారత జట్టులోకి వెంటనే తీసుకోవాలని చాలా...
13-05-2022
13-05-2022
May 13, 2022, 12:28 IST
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌.. కేకేఆర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ ఐపీఎల్‌ 2022 నుంచి వైదొలిగాడు. తుంటి ఎముక గాయం...
13-05-2022
May 13, 2022, 11:05 IST
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో తమ ప్రయాణాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తుంది. ఒక మ్యాచ్‌లో విజయం సాధించగానే తర్వాతి...
13-05-2022
May 13, 2022, 09:31 IST
ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్‌ వైఫల్యంతో ఘోర ప్రదర్శన చేసింది. సీఎస్కే బ్యాటర్లంతా కట్టగట్టుకొని విఫలం...
13-05-2022
May 13, 2022, 08:46 IST
తెలుగుతేజం తిలక్‌ వర్మ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో మరోసారి మెరిశాడు. గురువారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల లక్ష్య...
13-05-2022
May 13, 2022, 08:17 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆటగాళ్ల కంటే అంపైర్లే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. ఫీల్డ్‌ అంపైర్స్‌ నుంచి థర్డ్‌ అంపైర్‌ వరకు...
13-05-2022
May 13, 2022, 04:24 IST
ముంబై: ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు కోల్పోయిన తర్వాత మెరుగ్గా ఆడుతున్న ముంబై ఇండియన్స్‌ మరో విజయాన్ని తమ ఖాతాలో...
12-05-2022
May 12, 2022, 22:44 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే ఔటైన తీరు వివాదాస్పదంగా...
12-05-2022
12-05-2022
May 12, 2022, 18:50 IST
ఐపీఎల్‌-2022లో టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌, ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ దుమ్మురేపుతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఆర్‌సీబీ...
12-05-2022
May 12, 2022, 17:56 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో...
12-05-2022
May 12, 2022, 17:12 IST
పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రిషి ధావన్‌ టీమిండియాలోకి తిరిగి రావాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. రిషి ధావన్‌ బ్యాట్‌తో...
12-05-2022
May 12, 2022, 16:36 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లే​ ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాళ (మే 12) ముంబై...
12-05-2022
May 12, 2022, 15:24 IST
సీఎస్‌కే తాజా మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఐపీఎల్‌ 2022 సీజన్‌ మొత్తానికే దూరమైన విషయం తెలిసిందే....
12-05-2022
May 12, 2022, 13:13 IST
IPL 2022 Closing Ceremony: కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఆరంభ, ముగింపు వేడుకలను...
12-05-2022
May 12, 2022, 12:48 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌పై సూపర్‌ విక్టరీతో మెరిసింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి... 

Read also in:
Back to Top