IPL 2022: ముంబై తప్పక గెలవాలి.. రోహిత్‌ సేనపై ప్రేమ కురిపిస్తున్న ఆర్సీబీ! | IPL 2022 MI Vs DC: RCB Support MI Share Letter Ahead Delhi Clash | Sakshi
Sakshi News home page

MI Vs DC: ముంబై తప్పక గెలవాలి.. మా మద్దతు రోహిత్‌ సేనకే: ఆర్సీబీ ‘లేఖ’!

May 21 2022 4:30 PM | Updated on May 21 2022 4:51 PM

IPL 2022 MI Vs DC: RCB Support MI Share Letter Ahead Delhi Clash - Sakshi

ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌ జట్లు(PC: IPL/BCCI)

IPL 2022 MI Vs DC: ఒకరి ఓటమి మరొకరికి సంతోషం.. ముందుకు సాగేందుకు గొప్ప అవకాశం. ఢిల్లీ క్యాపిటల్స్‌ విషయంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు అన్వయించే వ్యాఖ్యలు ఇవి. ముంబై ఇండియన్స్‌తో జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోవాలని.. బెంగళూరు జట్టు కోరుకుంటోంది. అలా అయితేనే వాళ్లు ఐపీఎల్‌-2022లో కొనసాగే అవకాశం ఉంటుంది మరి!

అందుకే బెంగళూరుకు.. ముంబై జట్టుపై అమితమైన ప్రేమ కలిగింది. రోహిత్‌ సేన కచ్చితంగా పంత్‌ బృందాన్ని ఓడించాలని ఆర్సీబీ బలంగా కోరుకుంటోంది. ఆఖరికి తమ ట్విటర్‌ ప్రొఫైల్‌ పిక్‌లో రెడ్‌ కలర్‌ను బ్లూలోకి మార్చేంతంగా ప్రేమ పొంగిపోతోంది! అంతేనా ముంబైకి మద్దతు తెలుపుతూ ఓ ‘లేఖ’ కూడా రాసింది.

‘‘హేయ్‌.. ముంబై పల్టన్‌.. ఆర్సీబీ జట్టు మొత్తం మీకు చీర్స్‌ పలుకుతోంది. ఇప్పుడు మనమంతా ఒకే కుటుంబం.. ఢిల్లీతో మ్యాచ్‌లో బాగా ఆడండి’’ అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ స్టార్‌ ఫినిషర్‌ దినేశ్‌ కార్తిక్‌ తాను ముంబై జెర్సీలో ఉన్న పాత ఫొటోను షేర్‌ చేసి రోహత్‌ సేనకు మద్దతు పలికాడు.

ఇక బెంగళూరు ఫ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఢిల్లీని ముంబై ఓడిస్తేనే కదా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌నకు వెళ్లేది! కాబట్టి బెంగళూరు జట్టు ఇలా కోరుకోవడంలో తప్పేముంది! మీరేమంటారు అంతేగా! అంతేగా!  

చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్‌ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అందుకే ఇలా: సెహ్వాగ్‌
చదవండి👉🏾RR Vs CSK: హెట్‌మెయిర్‌ భార్యను ప్రస్తావిస్తూ గావస్కర్‌ కామెంట్‌.. ‘మీకసలు బుద్ధుందా’ అంటూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement