IPL 2022 Mega Auction: ఈ నలుగురు క్రికెటర్లు అమ్ముడుపోవడం కష్టమే!

IPL 2022 Mega Auction: These 4 Indian Players Who May Go Unsold at Auction Is It - Sakshi

IPL 2022 Mega Auction: These 4 Indian Players Who May Go Unsold at Auction Is It: ఐపీఎల్‌-2022 మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే రిటెన్షన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలను ప్రకటించిన ఫ్రాంఛైజీలు వేలంలో ఏ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుందన్న అంశంపై కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయే భారత ఆటగాళ్లు వీళ్లేనంటూ కొంతమంది పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.


PC: IPL

సురేశ్‌ రైనా
క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో సురేశ్‌ రైనా రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అతడు నాలుగో స్థానంలో (5528) ఉన్నాడు ఈ టీమిండియా మాజీ క్రికెటర్‌. అయితే, గత సీజన్‌ నుంచి రైనా తన స్థాయి ప్రదర్శన కనబరచలేక చతికిలపడ్డాడు.

చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఐపీఎల్‌-2021లోనూ తన మార్కు చూపలేకపోయాడు. కేవలం 160 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో సీఎస్‌కే అతడిని వదిలేసింది. కాగా ఒకప్పుడు గుజరాత్‌ లయన్స్‌ జట్టు కెప్టెన్‌గా ఉన్న రైనాపై జట్లు ఏ మేరకు ఆసక్తి చూపిస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది.

చదవండి: IPL 2022 Retention: వీళ్లను వదిలేశారు.. ఈ 11 మంది ఒకే జట్టులో ఉన్నారంటే రికార్డులు బద్దలే!

అంబటి రాయుడు
ఐపీఎల్‌-2021లో నిలకడగా ఆడలేకపోయిన అంబటి రాయుడు(13 ఇన్నింగ్స్‌లో 257 పరుగులు)ని సీఎస్‌కే వదిలేసింది. దీంతో అతడు వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా రాయుడు అనుభవజ్ఞుడైన ఆటగాడే అయినప్పటికీ.. ఫిట్‌నెస్, వయసు తనకు అడ్డంకిగా మారే ఛాన్స్‌ ఉంది. మరి మెగా వేలంలో రాయుడు అమ్ముడుపోతాడా అంటే కాలమే దానికి సమాధానం చెప్పాలి.


PC: IPL

హర్భజన్‌ సింగ్‌
టీమిండియా వెటరన్‌ ప్లేయర్‌ హర్భజన్‌ సింగ్‌ను మినీ వేలంలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ.. ఐపీఎల్‌-2021లో అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆడిన మూడు ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. దీంతో కేకేఆర్‌ అతడిని వదిలేసింది. రాయుడిలాగే వయసు, ఫిట్‌నెస్‌ పరంగా చూసుకుంటే.. ఫ్రాంఛైజీలు భజ్జీని కొనుగోలు చేసే అవకాశం కనిపించడం లేదు.


PC: IPL

దినేశ్‌ కార్తిక్‌
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాజీ కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ను ఆ జట్టు రిటైన్‌ చేసుకోని సంగతి తెలిసిందే. గత రెండు సీజన్లుగా డీకే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అంతేగాక... అతడు అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడి చాలా రోజులైంది. కాబట్టి డీకేను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవచ్చు. 

చదవండి: Shreyas iyer: అహ్మదాబాద్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..! రూ.15 కోట్లు ఆఫర్..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top