
IPL 2022 Auction: ఐపీఎల్-2022 మెగా వేలం ముగిసినా సోషల్ మీడియాలో ఆ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడు పోయాడు? ఏ ఫ్రాంఛైజీది సరైన ఎంపిక? ఎవరు అనవసరంగా డబ్బు ఖర్చు చేశారు? తదితర అంశాల గురించి ఐపీఎల్ ప్రేమికులు చర్చిస్తూనే ఉన్నారు. ఆటగాళ్ల విషయాన్ని కాసేపు పక్కన పెడితే... తన ఆకర్షణీయ రూపం, అందమైన నవ్వుకు తోడు చాకచక్యంగా వ్యవహరిస్తూ ఓ యువతి వేలంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నారు.
ఆమె మరెవరో కాదు... సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్.
ఐపీఎల్ ఫాలో అయ్యేవారికి కావ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన హావభావాలతో ఎన్నో సార్లు మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచారు ఆమె. 2018 వేలం సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఆమెకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. కావ్య పాప అంటూ ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. ఈసారి బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలం-2022లో కూడా 30 ఏళ్ల కావ్య మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రెండింగ్‌లో నిలిచారు. చాలా మంది నెటిజన్లు ఆమె గురించి సెర్చ్ చేశారు.
అసలు ఎవరీ కావ్య మారన్?
మీడియా మొఘల్‌గా పేరొందిన కళానిధి మారన్ కుమార్తె కావ్య. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్‌ఎం చానెల్స్ వ్యవహారాలు చూస్తున్నారు.
కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి కళానిధి మారన్ బంధువన్న విషయం తెలిసిందే. ఇక ఆయన సోదరుడు దయానిధి మారన్ చెన్నై సెంట్రల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక సంపన్న కుటుంబానికి చెందిన కావ్య... ఎస్‌ఆర్‌హెచ్‌లో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకోవడం విశేషం.
ఇక ఎస్‌ఆర్‌హెచ్ డైరెక్టర్ టామ్ మూడీ, బౌలింగ్ మెంటార్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి ఆమె ఐపీఎల్ మెగా వేలం-2022లో పాల్గొన్నారు. ఇక ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఆక్షన్‌లో హైదరాబాద్ అత్యధికంగా 10.75 కోట్లు వెచ్చించి విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను సొంతం చేసుకుంది.
చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్ వేలంలో అందాల భామ.. ఎవరా బ్యూటీ గర్ల్ ?
IPL 2022 Mega Auction: ఆరెంజ్ ఆర్మీ ఇదే..