రాజస్థాన్ రాయల్స్‌లోకి టీ 20 నెం.1 బౌలర్..

IPL 2021:Rajasthan Royals Sign Tabraiz Shamsi - Sakshi

జైపూర్‌: వచ్చేనెలలో జరిగే ఐపీఎల్‌ 2021 సెకెండ్‌ ఫేజ్‌ కు రాజస్థాన్ రాయల్స్ స్టార్‌ ఆటగాళ్లు జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై దూరమైన విషయం తెలిసిందే. అయితే  ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ టై స్థానంలో టీ 20 నెం.1 బౌలర్, సౌతాఫ్రికా సెన్సేషనల్ స్పిన్నర్ తబ్రాజ్ షమ్సీని  రాజస్థాన్ రాయల్స్  తీసుకుంది.  యూఏఈలో జరిగే  ఐపీఎల్‌ 2021 సీజన్ మిగిలిన మ్యాచ్‌లకు తబ్రాజ్ షమ్సీ తో ఒప్పందం కుదర్చుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ బుధవారం ప్రకటించింది.

2017 లో ఇంగ్లాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక టీ 20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా తరఫున  తబ్రాజ్ షమ్సీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. షమ్సీ 39 టీ20 మ్యాచుల్లో 45 వికెట్లు పడగొట్టి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్‌గా ఎదిగాడు. 2016  సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన తబ్రాజ్ షమ్సీ కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కి దూరమైన జోస్ బట్లర్ స్దానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ గ్లెన్ ఫిలిప్స్‌ను రాజస్థాన్ తీసుకుంది. 

చదవండి: హార్ధిక్‌ పాండ్యా రిస్ట్‌ వాచ్‌ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top