'ఈసారి సీఎస్‌కే ఆఖరి స్థానానికే పరిమితం'

ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభం కాకముందే కొందరు మాజీ క్రికెటర్లు ఈసారి టైటిల్ ఫేవరెట్ ఎవరు ఉంటారు.. ఆఖరిస్థానంలో ఎవరు నిలుస్తారు అని ముందే ఒక అంచనాకు వస్తున్నారు. దీనిలో భాగంగానే న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ ట్విటర్ వేదికగా ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. స్టైరిస్ ఐపీఎల్‌లో ఆడనున్న ఎనిమిది జట్లు ఏ స్థానంలో ఉంటాయో అంచనా వేస్తూపే టైటిల్ కొల్లగొట్టేది ఎవరు.. ఆఖరిస్థానంలో ఉండేది ఎవరో చెప్పుకొచ్చాడు.
స్టైరిస్ చెప్పిన ప్రకారం .. డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ నిలబెట్టుకుంటుందని.. ఆ జట్టు ఇప్పుడు అన్ని జట్లకన్నా పటిష్టంగా కనిపిస్తుందని.. అందుకే వారు ఫేవరెట్‌గా మారారని చెప్పాడు. ఇక రెండో స్థానంలో గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎంపిక చేశాడు. ఇక పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు వచ్చే మిగతా రెండు జట్లని తెలిపాడు. ఇక మరోసారి భారీ అంచనాల నడుమ బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ ఐదో స్థానానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పాడు. కెప్టెన్ మారినా రాయల్స్ తలరాత మారదని.. అయితే వేలంలో కోట్లు పెట్టి కొన్న క్రిస్ మోరిస్‌తో పాటు జోఫ్రా ఆర్చర్‌లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని.. అయినా ఆ జట్టు ఆరవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని తెలిపాడు.
ఇక ఆల్‌రౌండర్ల బలంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఏడో స్థానంలో ఉంటుందన్నాడు. గతేడాది సీజన్‌లో ఆరో స్థానంలో నిలిచిన సీఎస్‌కే ఈసారి ఆఖరి స్థానానికి పరిమితమవుతందని.. ఆ జట్టు ఈసారి తీవ్రంగా నిరాశపరిచే అవకాశాలు ఉన్నాయని స్టైరిస్ చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న ఐపీఎల్ 14వ సీజన్‌లో తొలి మ్యాచ్ డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ మధ్య జరగనుంది.
చదవండి:
అతను దూరమవడానికి పుజారా కారణమా!
IPL 2021: కెప్టెన్‌గా ధోని.. రైనాకు దక్కని చోటు
Let's try this
WAY TOO EARLY POWER RANKINGS @IPL 2021
1- @mipaltan
2- @DelhiCapitals
3- @PunjabKingsIPL (auction👍)
4- @SunRisers
5- @RCBTweets
6- @rajasthanroyals (Morris fitness/archer back quickly.Maybe ⬆️)
7- @KKRiders (batting worries)
8- @ChennaiIPLThoughts
— Scott Styris (@scottbstyris) April 2, 2021