కృనాల్‌.. నీ పద్ధతి మార్చుకుంటే మంచిది

IPL 2021: Krunal Pandya Ugly Behaviour With Ankul Roy During Match Viral - Sakshi

అహ్మదాబాద్‌: ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా తన సహచర ఆటగాడు అంకుల్‌ రాయ్‌పై ప్రవర్తించిన తీరు సోషల్‌ మీడియాలో విమర్శలకు దారితీసింది. విషయంలోకి వెళితే.. గురువారం ముంబై ఇండియన్స్‌ రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ ఆడిన సంగతి తెలిసిందే. ముంబై బ్యాటింగ్‌ సమయంలో డికాక్‌, కృనాల్‌లు క్రీజులో ఉన్నారు. కాగా బ్యాటింగ్‌ చేస్తున్న కృనాల్‌ పరుగు పూర్తి చేసే క్రమంలో బ్యాట్‌ను క్రీజులో పెట్టేందుకు కింద పడ్డాడు. దాంతో అతని చేతి రాసుకుపోయింది. దీంతో మాయిశ్చరైజర్‌ కావాలంటూ డగౌట్‌కు కాల్‌ ఇచ్చాడు. డగౌట్‌ నుంచి అంకుల్‌రాయ్‌ వచ్చి మాయిశ్చరైజర్‌ను అందించగ.. కృనాల్‌ దానిని తీసుకొని చేతికి రాసుకున్నాడు.

ఆ తర్వాత దాన్ని ఇచ్చే క్రమంలో అంకుల్‌ రాయ్‌ పట్ల కఠినంగా ప్రవర్తించాడు. మాయిశ్చరైజర్‌ను అతని చేతికి ఇవ్వకుండా ముఖానికి విసిరేసినట్లుగా పడేసి దురుసుగా ప్రవర్తించాడు. అయితే ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డ్‌ కాగా ఆలస్యంగా వెలుగుచూసింది. కృనాల్‌ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తప్పుబడుతున్నారు. ''కృనాల్‌ నీ పద్దతి మార్చుకుంటే బాగుంటుంది.. అప్పుడు దీపక్‌ హుడా.. ఇప్పుడు అంకుల్‌ రాయ్‌.. నువ్వు మారవా అంటూ'' కామెంట్లతో రెచ్చిపోయారు. ఇంతకముందు కూడా కృనాల్‌ పాండ్యా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోపీ సందర్భంగా దీపక్‌ హుడాపై దురుసుగా ప్రవర్తించిన తీరు వివాదానికి దారి తీసింది.

ఇక రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన ముంబై  రెండు వరుస పరాజయాలకు చెక్‌ పెట్టింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌ 18.3 ఓవర్లలోనే 172 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. డికాక్‌ 70* చివరివరకు నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
చదవండి: 'చహర్‌ ఇదేం బాలేదు.. పాపం జైస్వాల్‌ను చూడు'

'పో.. పో.. ఫోర్‌ వెళ్లు' అంటూ పొలార్డ్‌.. నోరెళ్లబెట్టిన మోరిస్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top