నీలాంటి కెప్టెన్‌ను చూడలేదు.. చాలా విచిత్రంగా ఉన్నావ్‌!

IPL 2021:  Gautam Gambhir Gambhir Slams Eoin Morgans Captaincy - Sakshi

చెన్నై:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం మ్యాచ్‌లో ఆర్సీబీ 205 పరుగుల టార్గెట్‌ను బోర్డుపై ఉంచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీకి మ్యాక్స్‌వెల్‌(78; 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదిరిపోయే ఇన్నింగ్స్‌తో అలరించగా, ఆపై ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఏబీ డివిలియర్స్‌(76 నాటౌట్‌; 34 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. కేకేఆర్‌ బౌలర్లపై విరుచుకుపడి స్కోరు బోర్డును రెండొందల పరుగులు దాటించాడు.  

ఇందుకు కారణం కేకేఆర్‌ ఇయాన్‌ మోర్గాన్‌ చేసిన తప్పిదాలేనని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ గౌతం గంభీర్‌ వేలెత్తి చూపాడు. ప్రధానంగా కోహ్లి(5), రజత్‌ పాటిదార్‌(1)లను రెండో ఓవర్‌లోనే ఔట్‌ చేసిన వరుణ్‌ చక్రవర్తిని సరిగా వినియోగించుకోలేకపోవడమేనని గంభీర్‌ ధ్వజమెత్తాడు. ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో గంభీర్‌ మాట్లాడుతూ.. మోర్గాన్‌పై చిందులు తొక్కాడు. ‘ నీ కెప్టెన్సీ నువ్వు.. నీలాంటి కెప్టెన్‌ను నా జీవితంలో చూడలేదు. ఒక బౌలర్‌ ఎవరైనా అతను వేసిన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు సాధిస్తే ఏం చేస్తాం. అతన్నే కొనసాగిస్తాం. అలా కోహ్లి, పాటిదార్‌లను ఔట్‌ చేసిన వరుణ్‌ చక్రవర్తిని పక్కన పెట్టి షకీబుల్‌ హసన్‌ను ఎందుకు తీసుకొచ్చావ్‌.  ఒక ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన బౌలర్‌ను కాదని అతని స్పెల్‌నే మార్చేశావ్‌.

వరుణ్‌తో రెండో ఓవర్‌ వేయించి, నాల్గో ఓవర్‌ను షకీబుల్‌కు చేత వేయించావు. నీలాంటి కెప్టెన్సీని నేను ఎక్కడా చూడలేదు. నా జీవితంలోనే ఈ తరహా కెప్టెన్సీ  ఎరుగను. చాలా విచిత్రమైన కెప్టెన్సీ నీది. ఆపై వెంటనే వరుణ్‌ చక‍్రవర్తి చేతికి బంతి ఇచ్చి ఉంటే, మ్యాక్స్‌వెల్‌ వికెట్‌ను తీసే అవకాశం ఉండేది. అప్పుడు మ్యాచ్‌ కేకేఆర్‌ వైపు ఉండేది’ అని తీవ్రంగా విమర్శించాడు.  ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను హర్భజన్‌ సింగ్‌ వేయగా, రెండో ఓవర్‌ను వరుణ్‌ వేశాడు. ఇక మూడో ఓవర్‌ను షకీబుల్‌తో వేయించిన మోర్గాన్‌.. మళ్లీ ఎనిమిదో ఓవర్‌ వరకూ వరుణ్‌కు ఇవ్వలేదు. ఇది విషయాన్ని గంభీర్‌ తీవ్రంగా తప్పుపడుతున్నాడు. గాయాల బారిన ‘సన్‌రైజర్స్‌’

ఇక్కడ చదవండి: నా ప్లేయర్‌ ద ఆఫ్‌ మ్యాచ్‌ అవార్డు అతనికే: యువీ
స్టోక్స్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అందజేసిన రాజస్థాన్‌ రాయల్స్‌..
రోహిత్‌ షూపై ఈసారి ఏం రాసుకొచ్చాడో తెలుసా.. 

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top