ఐపీఎల్‌ 2021: వాంఖడేలో కరోనా కలకలం

IPL 2021: BCCI Dilemma Eight Workers At Wankhede Stadium Test Positive - Sakshi

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభానికి ముందే కరోనా కలకలం రేపింది. ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా పాజటివ్‌గా సోకిన వారందరిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. దీంతో ఏప్రిల్‌ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌, సీఎస్‌కే మధ్య జరగనున్న లీగ్‌ మ్యాచ్‌ను నిర్వహించాలా వద్దా అనే దానిపై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. తాజాగా కరోనా కేసులు వెలుగు చూడడంతో వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన చేస్తుంది.

కాగా దేశంలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉండడంతో ఈసారి ఐపీఎల్‌ సీజన్‌ను 6 వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీ వేదికలుగా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఐపీఎల్‌లో ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలకు హోం అడ్వాంటేజ్‌ లేకుండా ఆరు వేదికల్లో మ్యాచ్‌లు ఆడేలా ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ఇంకా ఆరు రోజులే మిగిలిఉన్న నేపథ్యంలో  తాజాగా వాంఖడే స్టేడియం సిబ్బందికి కరోనా సోకడంతో కలవరం మొదలైంది.

చదవండి: 
ఐపీఎల్‌ చరిత్రలో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్స్‌

IPL‌ 2021: మెస్సీని వచ్చే ఏడాది తీసుకుంటాం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top