‘పిచ్‌లు తయారుచేసే టైమ్‌ లేదు.. ఇది బాధాకరం’

IPL 2021: Ajit Agarkar Slams The Pitch Used For PBKS Vs MI Match - Sakshi

చెన్నై:  పంజాబ్‌ కింగ్స్‌-ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య చెన్నైలోని చెపాక్‌లో పిచ్‌ చాలా పేలవంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ విమర్శించాడు.   చిన్న చిన్న స్కోర్లు నమోదు చేయడమే ఇక్కడ కష్టమైపోతుందని, ఈ తరహా పిచ్‌ల వల్ల ఉపయోగం లేదన్నాడు. కనీసం బోర్డుపై 150 నుంచి 160 పరుగులు  చేయలేని పిచ్‌లు ఎందుకని ప్రశ్నించాడు.  ఇది చాలా తేలికపాటి వికెట్‌ అని,  చాలా  అధ్వానంగా ఉందన్నాడు. ఇక్కడ గ్రౌండ్స్‌మెన్‌కు పిచ్‌లు తయారుచేయడానికి సమయం దొరక్కపోవడం బాధాకరమన్నాడు. ప్రత్యామ్నాయ రోజుల్లో కూడా గ్రౌండ్స్‌మెన్‌కు పిచ్‌ను తయారు చేసే అవకాశమే లేదన్నాడు.  మ్యాచ్‌లు చాలా వేగవంతంగా జరుగుతున్న క్రమంలో గ్రౌండ్స్‌మెన్‌కు సవాల్‌గా మారిందన్నాడు. ఇది చాలా బాధకరమని అగార్కర్‌ విచారం వ్యక్తం చేశాడు. 

ముంబై నిర్దేశించిన 132 పరుగులు చేసేటప్పుడు కూడా పంజాబ్‌ కింగ్స్‌  క్యాంప్‌లో కాస్త  ఆందోళన కనబడిందన్నాడు. ప్రత్యేకంగా మధ్య ఓవర్లలో ఈ పిచ్‌ దారుణంగా మారిపోతుందని విమర్శించాడు.  అటు తొలుత బ్యాటింగ్‌కు అనుకూలించక, ఇటు ఛేజింగ్‌కు అనుకూలించని పిచ్‌లు వల్ల ఉపయోగం లేదన్నాడు.  ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్పోతో మాట్లాడిన అగార్కర్‌.. ‘ నాకు క్లిష్టమైన పిచ్‌ వల్ల ఇబ్బందేమీ లేదు. నేను ఎన్నో పిచ్‌లపై ఆడాను. ఒక మాజీ బౌలర్‌గా కనీసం 150-160 పరుగులు చేసే  పిచ్‌లైనా ఉండాలి.  ఆ స్కోరును ఛేజింగ్‌ చేసే టీమ్‌ సాధిస్తుందా.. లేదా అనేది వేరే అంశం.  ముందు పిచ్‌పై కనీసం పరుగులు రానప్పుడు ఎందుకు’ అని నిలదీశాడు. 

ఇక్కడ చదవండి: రోహిత్‌.. సెహ్వాగ్‌ను ఓపెనింగ్‌ వద్దనగలమా?
వారి వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలి: రసెల్‌
రాజస్తాన్ రాయల్స్‌‌కు కొత్త ఆటగాడు.. రాత మారుతుందా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top