
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానం గణం ఎక్కువే. ఆరడుగుల అందగాడు ఏం తింటాడు, ఫిట్‌నెస్ ఎలా మెయింటేన్ చేస్తున్నాడన్న సీక్రెట్స్ తెలుసుకోవాలని అతన్ని ప్రేమించే అభిమానులకు కుతూహులం ఉండడం సహజం. అంతేకాదు మ్యాచ్‌లో కనిపించిన ప్రతీసారి రొనాల్డో చేతులకు రెండు రింగులు కనిపిస్తాయి. అందులో ఒకటి ఫిట్‌నెస్ రింగ్ అయితే.. మరొకటి బ్రేస్‌లెట్(Bracelet).
బ్రేస్‌లెట్(Bracelet) అనేది తన పర్సనల్ కాబట్టి దాని గురించి మాట్లాడుకోనవసరం లేదు. కానీ రొనాల్డో ఫుట్ సీక్రెట్ ఏంటి.. ఫిట్‌నెస్ రింగ్ ఎందుకు ధరించాడనే దానిని ఒక వ్యక్తి బట్టబయలు చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రస్తుతం రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నసర్ క్లబ్ న్యూట్రిషనిస్ట్ జోస్ బ్లీసా. స్పానిష్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో ఫుట్ సీక్రెట్స్‌తో పాటు అతని ఫిట్‌నెస్ రింగ్ రహస్యాన్ని పంచుకున్నాడు.
''రొనాల్డో తన ఫుడ్‌లో కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలకు ఎక్కువ చోటిస్తాడు. అతను పాటించే స్ట్రిక్ట్ డైట్ ఫిట్‌గా ఉంచేందుకు దోహదపడుతుంది. తినే ఆహారాన్ని బట్టి ఆరోజు ఎన్ని కేలరీలు కరిగించాలనేది రొనాల్డో ముందుగానే నిర్ణయించుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే తనను తాను ప్రిపేర్ చేసుకుంటాడు. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి.
ప్రస్తుతం రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నసర్ క్లబ్‌లోని ఆటగాళ్లంతా రొనాల్డో కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నారు. దీనివల్ల ఆటగాళ్లలో 90శాతం మార్పు కనిపిస్తోంది. కొవ్వు తక్కువున్న పదార్థాలను తీసుకుంటూ ఆటగాళ్లు గంటల తరబడి ఎక్సర్‌సైజులు చేస్తూ తమ ఫిట్‌నెస్‌ను రోజురోజుకు మరింత మెరుగుపరుచుకుంటున్నారు.
అల్-నసర్ క్లబ్ న్యూట్రిషనిస్ట్ జోస్ బీస్లాతో రొనాల్డో
ఇక రొనాల్డో చేతులకు రెండు రింగులు ఉంటాయి. ఒకటి బ్రేస్‌లెట్.. మరొకటి ఫిట్‌నెస్ రింగ్. ఈ ఫిట్‌నెస్ రింగ్ రొనాల్డో ఎంతసేపు నిద్రపోతున్నాడు.. ఎంతసేపు ఫిజికల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉన్నాడనేది లెక్కిస్తుంది. అతను పడుకున్నా, కదలికలు ఉన్నా ఫిట్‌నెస్ రింగ్ పని చేస్తూనే ఉంటుంది. అంతేకాదు హార్ట్‌బీట్‌తో పాటు శ్వాసరేటను, శరీర ఉష్ణోగ్రతను, కదలికలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇక బ్రేస్‌లెట్ అతని పర్సనల్ విషయం.. దాని గురించి ఆరా తీయలేదు(నవ్వుతూ)'' ముగించాడు.
ఇక రొనాల్డో గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పోర్చుగల్ జట్టును విజేతగా నిలపడంలో విఫలమైన రొనాల్డో కేవలం ఒకే ఒక్క గోల్ కొట్టి దారుణ ప్రదర్శన చేశాడు. అటుపై మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో జరిగిన వివాదం తెగదెంపులకు దారి తీసింది. అయితే రొనాల్డో క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదు. అల్-నసర్ ఫుట్‌బాల్ క్లబ్‌తో రొనాల్డో రెండేళ్ల కాలానికి భారీ ఒప్పందం చేసుకున్నాడు.
Beautiful 💛🎶 https://t.co/uFWlOgLkQv pic.twitter.com/PgdCK697N0
— AlNassr FC (@AlNassrFC_EN) February 17, 2023
చదవండి: 'కనబడుట లేదు'.. ఐపీఎల్‌లో ఆడించేందుకే ఈ డ్రామాలు
Christian Atsu: టర్కీ భూకంపం.. మృత్యువుతో పోరాడి ఓడిన స్టార్ ఫుట్‌బాలర్
Viswanathan Anand: చదరంగంలో మిస్టర్ మేధావి.. తొలి గురువు ఎవరంటే?