Ind vs Aus 2024: పెర్త్‌లో తొలి టెస్టు!  | Indian cricket team is scheduled to tour Australia from November 2024 to January 2025 - Sakshi
Sakshi News home page

Ind vs Aus 2024: పెర్త్‌లో తొలి టెస్టు! 

Published Wed, Mar 20 2024 2:08 AM

Indias tour of Australia at the end of the year - Sakshi

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన  

మెల్‌బోర్న్‌: టెస్టు ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్న భారత జట్టు ఈ ఏడాది చివర్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) విజేత ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో పోటీపడనుంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ సిరీస్‌ జరుగుతుంది. నవంబర్‌లో మొదలయ్యే ఈ సిరీస్‌లో ఐదు టెస్టుల వేదికలను క్రికెట్‌ ఆస్ట్రేలియా ఖరారు చేసినట్లు సమాచారం.

ఈ రెండు మేటి జట్ల మధ్య జరిగే తొలి టెస్టుకు పెర్త్‌ ఆతిథ్యమివ్వనుంది. అనంతరం రెండో టెస్టు అడిలైడ్‌లో... మూడో టెస్టు బ్రిస్బేన్‌లో... నాలుగో టెస్టు మెల్‌బోర్న్‌లో... చివరిదైన ఐదో టెస్టు సిడ్నీలో జరగనున్నాయి. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టు డే–నైట్‌గా జరుగుతుంది. ఈ సిరీస్‌ పూర్తి షెడ్యూల్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ నెలాఖరులో అధికారికంగా ప్రకటించనుంది.     

Advertisement
Advertisement