అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్న భారత హాకీ జట్టు

Indian Mens Hockey Team Ranked 3 In World Rankings - Sakshi

లుసానే: ప్రపంచ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ర్యాంకింగ్స్‌లో భారత్‌ అత్యుత్తమంగా మూడో ర్యాంక్‌తో ఈ ఏడాదిని ముగించనుంది. గురువారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 2,296.038 పాయింట్లతో భారత్‌ మూడో ర్యాంక్‌ను కాపాడుకుంది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత పురుషుల జట్టు ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఎఫ్‌ఐహెచ్‌ ర్యాంకింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టాక భారత్‌ మూడో ర్యాంక్‌తో ఏడాదిని ముగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మహిళల ర్యాంకింగ్స్‌లో భారత హాకీ జట్టు తొమ్మిదో ర్యాంక్‌తో ఈ ఏడాదిని ముగించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top