భారత ఫుట్‌బాల్ సమాఖ్య (AIFF) అధ్యక్షుడు కల్యాణ్ చౌబేపై మహిళల కమిటీ హెడ్ వలంకా అలేమావో వేధింపుల ఆరోపణలు చేశారు. మార్చి 29న ఢిల్లీలోని ఫుట్‌బాల్ హౌస్‌లో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆమె ఓ లేఖలో పేర్కొన్నారు.
ఆ సమావేశంలో చౌబే, ఉపాధ్యక్షుడు హారిస్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం. సత్యనారాయణ తనను హేళన చేసి మాట్లాడారని వలంకా ఆరోపించారు. అధ్యక్షుడు చౌబే తన స్వరాన్ని అణచివేసి, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతటితో ఆగకుండా గట్టిగా మాట్లాడి భయపెట్టే ప్రయత్నం చేశారని లేఖలో ప్రస్తావించారు.
వలంకా అలేమావో ఎవరు..?
AIFF మహిళల విభాగపు అధిపతి అయిన వలంకా అలేమావో గోవా మాజీ ముఖ్యమంత్రి చర్చిల్ అలేమావో కుమార్తె. ఆమె చర్చిల్ బ్రదర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌కు కూడా CEOగా వ్యవహరిస్తారు. 2025–2029 కాలానికి FIFA మహిళల ఫుట్‌బాల్ అభివృద్ధి కమిటీలో నియమితులైన తొలి భారతీయ మహిళ వలంకా.
వివాదం నేపథ్యం
మహిళల ఆసియా కప్ ప్రచారంలో జట్టు నిర్వహణ, లాజిస్టిక్స్‌లో జరిగిన పరిపాలనా తప్పిదాలపై వలంకా చౌబేకు లేఖ రాసి, బాధ్యత వహించాలని కోరారు. అలాగే ప్రధాన నిర్ణయాల్లో మహిళల కమిటీని సంప్రదించడం లేదని నిలదీశారు. ఈ విషయమై ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతుండగా, చౌబే సహనం కోల్పోయారని తెలుస్తుంది.


