breaking news
Indian Football Federation
-
మాజీ సీఎం కూతురికి వేధింపులు
భారత ఫుట్‌బాల్ సమాఖ్య (AIFF) అధ్యక్షుడు కల్యాణ్ చౌబేపై మహిళల కమిటీ హెడ్ వలంకా అలేమావో వేధింపుల ఆరోపణలు చేశారు. మార్చి 29న ఢిల్లీలోని ఫుట్‌బాల్ హౌస్‌లో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆమె ఓ లేఖలో పేర్కొన్నారు. ఆ సమావేశంలో చౌబే, ఉపాధ్యక్షుడు హారిస్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం. సత్యనారాయణ తనను హేళన చేసి మాట్లాడారని వలంకా ఆరోపించారు. అధ్యక్షుడు చౌబే తన స్వరాన్ని అణచివేసి, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతటితో ఆగకుండా గట్టిగా మాట్లాడి భయపెట్టే ప్రయత్నం చేశారని లేఖలో ప్రస్తావించారు. వలంకా అలేమావో ఎవరు..? AIFF మహిళల విభాగపు అధిపతి అయిన వలంకా అలేమావో గోవా మాజీ ముఖ్యమంత్రి చర్చిల్ అలేమావో కుమార్తె. ఆమె చర్చిల్ బ్రదర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌కు కూడా CEOగా వ్యవహరిస్తారు. 2025–2029 కాలానికి FIFA మహిళల ఫుట్‌బాల్ అభివృద్ధి కమిటీలో నియమితులైన తొలి భారతీయ మహిళ వలంకా. వివాదం నేపథ్యం మహిళల ఆసియా కప్ ప్రచారంలో జట్టు నిర్వహణ, లాజిస్టిక్స్‌లో జరిగిన పరిపాలనా తప్పిదాలపై వలంకా చౌబేకు లేఖ రాసి, బాధ్యత వహించాలని కోరారు. అలాగే ప్రధాన నిర్ణయాల్లో మహిళల కమిటీని సంప్రదించడం లేదని నిలదీశారు. ఈ విషయమై ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతుండగా, చౌబే సహనం కోల్పోయారని తెలుస్తుంది. -
తొలిసారి మహిళా ఫుట్‌బాల్ లీగ్
న్యూఢిల్లీ: భారత క్రీడారంగం చరిత్రలో మరో కొత్త లీగ్‌కు తెర లేవనుంది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి తొలిసారిగా ఇండియన్ ఉమెన్స్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) జరగనుంది. వచ్చే నెల 14 వరకు జరిగే ఈ లీగ్‌ను మంగళవారం ఆవిష్కరించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగే పోటీల్లో జెప్పియార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎఫ్‌సీ (పుదుచ్చేరి), ఎఫ్‌సీ అలఖ్‌పురా (మిజోరం), ఎఫ్‌సీ పుణే సిటీ (మహారాష్ట్ర), రైజింగ్ స్టూడెంట్ క్లబ్ (ఒడిషా), ఈస్టర్న్ స్పోర్టింగ్ యూనియన్ (మణిపూర్) పేరిట ఆరు జట్లు పాల్గొంటాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్‌తోపాటు ఐడబ్ల్యూఎల్ చైర్పర్సన్ సారా పైలట్ కూడా పాల్గొన్నారు.


