రిజ్వాన్‌ కోలుకోవడం‍లో భారత డాక్టర్‌ కీలక పాత్ర... కృతజ్ఞతగా ఏమి ఇచ్చాడంటే..

Indian doctor who treated Mohammad Rizwan gets signed jersey from Pakistani cricketer: Report - Sakshi

Indian doctor who treated Mohammad Rizwan: టీ20 ప్రపంచకప్‌-2021లో అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్‌.. టోర్నీ లీగ్‌ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే గురువారం (నవంబర్‌-11)న ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌ అనూహ్యంగా ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ మహ్మద్ రిజ్వాన్ తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.

ఛాతి ఇన్ఫెక్షన్ కారణంగా రెండు రోజులు ఐసీయూలో గడిపిన రిజ్వాన్  .. నేరుగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో 52 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టు మంచి స్కోర్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో రిజ్వాన్‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తీవ్ర అనారోగ్యానికి గురైన రిజ్వాన్‌ త్వరగా కోలుకోవడంలో ఓ భారతీయ డాక్టర్‌ పాత్ర ఉంది.  దుబాయ్‌లోని మెడెరో ఆసుపత్రిలో పల్మోనాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ షహీర్ సైనాలాబ్దీన్.. రిజ్వాన్‌కు రెండు రోజులు పాటు వైద్యం అందించాడు. 

ముజే ఖేల్నా హై, టీమ్ కె సాత్ రెహనా హై (నేను జట్టుతో ఆడాలనుకుంటున్నాను, నేను జట్టులో ఎలాగైనా ఉండాలి) అని రిజ్వాన్ వైద్యులతో చెప్పాడంట. "రిజ్వాన్‌ తీవ్రమైన చెస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ కు గురైయ్యాడు. సెమీఫైనల్‌కు ముందు కోలుకోవడం కష్టంగా అనిపించింది. ఎందుకంటే చెస్ట్‌ ఇన్ఫెక్షన్‌తో బాధ పడతున్నవారు ఎవరైనా కోలుకోవడానికి సాధారణంగా 5-7 రోజులు పడుతుంది. కానీ రిజ్వాన్‌ ఇంత త్వరగా ​ కోలుకోవడం నన్ను కూడా ఆశ్చర్యపరిచింది.

రిజ్వాన్ ధైర్యంగా, దృడ సంకల్పంతో ఉన్నాడు. క్రీడాకారుడిగా అతడి శారీరక దృఢత్వం, పట్టుదల రిజ్వాన్ కోలుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. అతడు 35 గంటలు ఐసీయూలో ఉన్నాడు”అని డాక్టర్ సైనాలాబ్దీన్ పేర్కొన్నాడు. కాగా తాను ఇంత త్వరగా   కోలుకోవడానికి కారణమైన కృతజ్ఞతగా డాక్టర్ సైనాలాబ్దీన్‌కు  తాను ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని మహ్మద్ రిజ్వాన్ అందచేశాడు.

చదవండి: T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్‌.. కాన్వే స్థానంలో ఎవరంటే

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top