‘జాతీయ శిబిరానికి వెళ్లేది లేదు’  

Indian Boxer Vikas Krishan Speaks About National Camp - Sakshi

బాక్సర్‌ వికాస్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బాక్సర్లకు సన్నాహకంగా పటియాలలో నిర్వహించే జాతీయ శిక్షణ శిబిరంలో తాను పాల్గొనేది లేదని భారత టాప్‌ బాక్సర్‌ వికాస్‌ కృషన్‌æ స్పష్టం చేశాడు. అక్కడ ట్రైనింగ్‌ తీసుకోవడం కంటే... తాను అమెరికాలో కొన్ని ప్రొ బాక్సింగ్‌ బౌట్‌లలో తలపడేందుకు ఇష్టపడతానని చెప్పాడు. ప్రస్తుతం వికాస్‌ బెంగళూరులోని ‘ఇన్‌స్పైర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఐఐఎస్‌)’లో ఆమెరికన్‌ కోచ్‌ రొనాల్డ్‌ సిమ్స్‌ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు.

దాంతో కరోనా క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించాడనే కారణంతో భారత బాక్సింగ్‌ సమాఖ్య వికాస్‌పై విచారణకు ఆదేశించింది. అనంతరం అతడు కావాలని ఇదంతా చేయలేదని తేలడంతో అతడిని వెంటనే పాటియాలలోని శిక్షణ శిబిరంలో ప్రాక్టీస్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. దీనిపై స్పందించిన వికాస్‌... ప్రస్తుతం ఐఐఎస్‌లో తన శిక్షణ చక్కగా కొనసాగుతుందని, అటువంటప్పుడు ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top