IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సూర్యకుమార్‌కు నో ఛాన్స్‌! కిషన్‌కు చోటు

India vs New zealand 1st ODI Playing 11 Prediction - Sakshi

కొత్త ఏడాదిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇప్పుడు మరో సిరీస్‌పై కన్నేసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లలో తలపడనుంది. తొలుత ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే హైదరాబాద్‌ వేదికగా జనవరి 18 (బుధవారం జరగనుంది). ఇక మొదటి వన్డేలో భారత తుది జట్టు ఎంపిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు తలనొప్పిగా మారింది.

ఈ సిరీస్‌కు భారత స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌ ఇద్దరు దూరమమ్యారు. ఈ క్రమంలో రాహుల్‌ స్థానంలో కిషన్‌ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. అయితే కిషన్‌కు జట్టులో చోటు దక్కితే ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే కిషన్‌ దాదాపు ఓపెనర్‌గానే బ్యాటింగ్‌ వచ్చేవాడు. మిడిలార్డర్‌లో కిషన్‌కు పెద్దగా అనుభవం లేదు.

మరోవైపు ఓపెనర్‌గా గిల్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి గిల్‌ను తప్పించి కిషన్‌ను ఓపెనర్‌గా పంపే సాహసం మాత్రం మేనేజ్‌మెంట్‌ చేయకపోవచ్చు. ఈ క్రమంలో తుది జట్టు ప్రకటించే అంతవరకు వేచి ఉండాల్సిందే. మరోవైపు అక్షర్‌పటేల్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.

అదే విధంగా సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌పై మరోసారి మేనేజ్‌మెంట్‌ నమ్మకం ఉంచే అవకాశం ఉంది. ఇక ​శ్రీలంకపై వన్డే సిరీస్‌లో అదరగొట్టిన కుల్దీప్‌ యాదవ్‌ను తుది జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో చాహల్‌ బెంచ్‌పై కూర్చోవాల్సిందే. అదే విధంగా జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్‌ కూడా తొలి వన్డే ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కకపోవచ్చు.
తుది జట్టు(అంచనా): రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మాన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
చదవండి: 
IND vs NZ: మా సంజూ ఎక్కడ? గుండెల్లో ఉన్నాడు.. శబాష్‌ సూర్య! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top