IND vs ENG 5th Test: ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం

India Vs England 5th Test Day 5: Updates And Highlights In Telugu - Sakshi

ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం
ఎడ్డ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌తో జరిగిన రీషెడ్యూల్డ్‌ ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో  ఘన విజయం సాధించింది. . దాంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ 2-2తో సమమైంది. గతేడాది జరిగిన నాలుగు టెస్టుల్లో భారత్‌ రెండు, ఇంగ్లండ్‌ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించగా.. మరో మ్యాచ్‌ డ్రా ముగిసింది. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జానీ బెయిర్‌స్టో(114), జో రూట్‌ (142) సెంచరీలతో చెలరేగారు.


జానీ బెయిర్‌ స్టో సెంచరీ..
తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో జట్టును అదుకున్న జానీ బెయిర్‌ స్టో.. రెండో ఇన్నింగ్‌లోనూ సెంచరీతో మెరిశాడు. 126 బంతుల్లో బెయిర్‌ స్టో సెంచరీను పూర్తి చేశాడు. ఇక ఇంగ్లండ్‌ విజయానికి 21 పరుగులు కావాలి. క్రీజులో బెయిర్‌ స్టో(100), రూట్‌(135) పరుగులతో ఉన్నారు.

69 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 325/3
69 ఓవర్లకు ముగిసే  సరికి ఇంగ్లండ్‌ మూడు వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. క్రీజులో రూట్‌(113),  బెయిర్‌ స్టో(92) పరుగులతో ఉన్నారు. ఇంగ్లండ్‌ విజయానికి 53 పరుగులు కావాలి.


జో రూట్‌ సెంచరీ.. 
ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జోరూట్‌ సెంచరీతో చెలరేగాడు. 137 బంతుల్లో రూట్‌ సెంచరీ సాధించాడు (14 ఫోర్లు). ఇక విజయానికి ఇంగ్లండ్‌ మరింత చేరువైంది. గెలుపుకు కేవలం 59 పరుగుల దూరంలో ఇంగ్లండ్‌ నిలిచింది.

63 ఓవర్లకు స్కోర్‌: 298/3
63 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ 298 పరుగులు చేసింది. ఇంకా ఇంగ్లండ్‌ విజయానికి 80 పరుగులు ‍కావాలి. జులో జానీ బెయిర్ స్టో(92), జోరూట్(87) పరుగులతో ఉన్నారు.


గెలుపు దిశగా ఇంగ్లండ్‌.. 59 ఓవర్లకు స్కోర్‌: 271/3
ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ 59 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు నష్టానికి 271 పరుగులు చేసింది. ఇంకా ఇంగ్లండ్‌ విజయానికి 107 పరుగులు ‍కావాలి. జులో జానీ బెయిర్ స్టో(83), జోరూట్(78) పరుగులతో ఉన్నారు.

ఐదో రోజు ఆట ప్రారంభం
ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు అఖరి రోజు ఆటను ఇంగ్లండ్‌ ప్రారం‍భించింది. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి  మూడు వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ విజయానికి మరో 119 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో జానీ బెయిర్ స్టో(72), జోరూట్(76 ) పరుగులతో ఉన్నారు. ఇక భారత్‌ విజయం సాధించాలంటే బౌలర్లు ఏదైనా అద్భుతం చేయాల్సిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top