‘క్వారంటీన్‌ నిబంధనలు మారవు’

India request for shorter quarantine in Australia likely to be rejected - Sakshi

భారత్‌ విజ్ఞప్తిని తిరస్కరించిన ఆస్ట్రేలియా

సిడ్నీ: ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో కోవిడ్‌–19కు సంబంధించిన ఆంక్షల్లో తమకు కొన్ని సడలింపులు ఇవ్వాలంటూ బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని క్రికెట్‌ ఆస్ట్రేలియా తిరస్కరించింది. ప్రస్తుతం అక్కడి నిబంధనల ప్రకారం విదేశాలనుంచి ఎవరు వచ్చినా సరే...కనీసం రెండు వారాల పాటు హోటల్‌ క్వారంటీన్‌లో ఉండాల్సిందే.

అయితే ఇది తమ ఆటగాళ్లను మానసికంగా దెబ్బ తీస్తుందని, దానికి బదులుగా బయో సెక్యూర్‌ బబుల్‌లో సాధన చేసేందుకు అవకాశం ఇవ్వాలని భారత బోర్డు కోరింది. భారత్‌ ఆస్ట్రేలియా గడ్డపై ముందుగా బ్రిస్బేన్‌లో అడుగు పెట్టాల్సి ఉంది. అయితే అక్కడి క్వీన్స్‌లాండ్‌ ప్రభుత్వం మాత్రం కరోనా నిబంధనల్లో ఏమాత్రం సడలింపులు ఇవ్వమని తేల్చేసింది. భారత క్రికెట్‌ జట్టయినా సరే, ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనంటూ అక్కడి అధికారులు స్పష్టం చేశారు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత భారత బృందం ఆస్ట్రేలియాకు వెళుతుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top