Asian Games 2023: ఆసియాక్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్‌ మెడల్‌.. | India Has Achieved Its First Gold In 10 Metre Air Rifle Team Event At The Asian Games 2023 - Sakshi
Sakshi News home page

Asian Games 2023: ఆసియాక్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్‌ మెడల్‌..

Sep 25 2023 8:03 AM | Updated on Sep 25 2023 9:13 AM

India has achieved its first gold at the Asian Games 2023 - Sakshi

చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడలు-2023లో భారత్‌ తొలి గోల్డ్‌మెడల్‌ సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్  స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది.

క్వాలిఫికేషన్ ఫైనల్‌ రౌండ్‌లో 1893.7 స్కోర్‌తో భారత్‌ అగ్రస్ధానంలో నిలిచింది.  ఆ తర్వాతి స్ధానంలో నిలిచిన ఇండోనేషియా(1890.1 స్కోర్‌) సిల్వర్‌ మెడల్‌ సొం‍తం చేసుకుంది. మూడో స్ధానంలో నిలిచిన చైనా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement