లంక జట్టుకు మరో షాక్‌.. గాయం కారణంగా స్టార్‌ క్రికెటర్‌ ఔట్‌ | Sakshi
Sakshi News home page

IND Vs SL: లంక జట్టుకు మరో షాక్‌.. గాయం కారణంగా స్టార్‌ క్రికెటర్‌ ఔట్‌

Published Fri, Jul 16 2021 5:26 PM

IND Vs SL: Kusal Perera Ruled Out Of ODI And T20 Series - Sakshi

కొలొంబో: భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మెన్ కుశాల్ పెరీరా దూరం కానున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కుశాల్ పెరీరా.. సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్దలతో విభేదించిన విషయం తెలిసిందే. అయితే.. అదే సమయంలో అతని భుజానికి కూడా గాయం కావడంతో అతను సిరీస్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కుశాల్ పెరీరా గాయాన్ని పరిశీలించిన వైద్యులు కనీసం ఆరు వారాలు విశ్రాంతి అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో.. జులై 18 నుంచి 29 వరకు టీమిండియాతో జరుగనున్న సిరీస్‌కు అతను దూరంగా ఉండటం ఖరారైంది. ఇదిలా ఉంటే, ధవన్‌ సేనతో సిరీస్ కోసం లంక జట్టును ఇంకా ప్రకటించలేదు. 

కాగా, 2013లో శ్రీలంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కుశాల్ పెరీరా.. ఇప్పటి వరకూ 22 టెస్టులు, 107 వన్డేలు, 49 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 8 సెంచరీలు నమోదు చేసిన అతను.. నమ్మదగిన ఓపెనర్, వికెట్ కీపర్‌గా ఎదిగాడు. కుశాల్ పెరీరా స్థానంలో భారత్‌తో సిరీస్‌కు శనక కెప్టెన్‌గా ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై లంక క్రికెట్‌ బోర్డు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement