Ind Vs Sa Test Seires: ప్రొటిస్‌ జట్టు ఇదే.. పాక్‌కు చుక్కలు చూపించిన బౌలర్‌ వచ్చేశాడు!

Ind Vs Sa: South Africa Announce 21 Man Squad For India Tests Duanne Olivier Returns - Sakshi

Ind Vs Sa: South Africa Announce 21 Man Squad For India Tests Duanne Olivier Returns: టీమిండియాతో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం క్రికెట్‌ సౌతాఫ్రికా జట్టును ప్రకటించింది. స్వదేశంలో డిసెంబరు 26 నుంచి ప్రారంభం కానున్న సిరీస్‌ కోసం 21 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. కాగా 2019లో చివరిసారిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన డువాన్‌ ఒలివర్‌కు పిలుపు రావడం గమనార్హం. కగిసో రబడ, అన్రిచ్‌ నోర్ట్జేలతో పాటు ఒలివర్‌ కూడా చేరడంతో బౌలింగ్‌ దళం మరింత పటిష్టంగా మారనుంది. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ సారథ్యంలో సాగనున్న ఈ సిరీస్‌కు తెంబా బవుమా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

టీమిండియాతో సిరీస్‌కు ప్రొటిస్‌ జట్టు:
డీన్‌ ఎల్గర్‌(కెప్టెన్‌), తెంబా బవుమా(వైస్‌ కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌(వికెట్‌ కీపర్‌), కగిసొ రబడ, సరేల్‌ ఎర్వీ, బ్యూరన్‌ హెన్రిక్స్‌, జార్జ్‌ లిండే, కేశవ్‌ మహరాజ్‌, లుంగి ఎంగిడి, ఎడెన్‌ మార్కరమ్‌, వియాన్‌ మల్డర్‌, అన్రిచ్‌ నోర్ట్జే, కీగన్‌ పీటర్సన్‌, రసే వాన్‌ డెర్‌ డసేన్‌, కైలీ వెరెన్‌, మార్కో జాన్సన్‌, గ్లెంటన్‌ స్టరమ్మాన్‌, ప్రెనెలన్‌ సుబ్రయేన్‌, సిసాండ మగల, రియాన్‌ రికెల్టన్‌, డువాన్‌ ఒలివర్‌.


PC: ICC

అప్పుడు పాకిస్తాన్‌ను చుక్కలు చూపించాడు
10 టెస్టు మ్యాచ్‌లలో 43 వికెట్లు తీసిన ఘనత డువాన్‌ ఒలివర్‌ది. ముఖ్యంగా పాకిస్తాన్‌ బ్యాటర్లకు చు​క్కలు చూపించాడు ఈ ఫాస్ట్‌ బౌలర్‌. 2018-19లో పాక్‌తో సిరీస్‌లో భాగంగా.. 3 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన ఒలివర్‌.. కొన్ని రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌ కోసం అతడిని ఎంపిక చేయడం విశేషం. ఈ నేపథ్యంలో డువాన్‌ గనుక తుది జట్టులో చోటు దక్కించుకున్నట్లయితే.. టీమిండియా బౌలర్లకు తిప్పలు తప్పవు మరి!

చదవండి: India Tour of South Africa- Revised Schedule: టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top