IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. గ్రౌండ్‌లోకి వచ్చిన పాము! వీడియో వైరల్

గౌహతి వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న రెండో టీ20లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ఓ అనుకోని అతిథి వచ్చింది. టీమిండియా ఇన్నింగ్స్ జరుగుతుండగా పాము గ్రౌండ్‌లోకి వచ్చింది.
అయితే కేఎల్ రాహుల్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పాముని గమనించి అంపైర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్టేడియం భద్రతా సిబ్బిందికి సమాచారం ఇవ్వగా.. పామును పట్టుకుని వెళ్లారు. దీంతో 10 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది.
కాగా భారత్ వేదికగా జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇటువంటి సంఘట జరగడం ఇదే తొలి సారి కావడం గమానార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 237 పరుగులు భారీ స్కోర్ సాధించింది.
భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(28 బంతుల్లో 57), సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 61) అర్ధసెంచరీలతో చెలరేగారు. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(43), విరాట్ కోహ్లి(49), కార్తీక్( 7 బంతుల్లో 17) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ప్రోటీస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్‌కే రెండు వికెట్లు దక్కాయి.
#INDvsSA pic.twitter.com/E0kvbafucc
— Sanju Here 🤞👻 (@me_sanjureddy) October 2, 2022
చదవండి: Irani Cup 2022: సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన సూర్యకుమార్..
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు