IND vs SA: రెండో టీ20కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగేనా?

IND vs SA: Rain threat looming as 2ND T20 in Guwahati - Sakshi

దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది.  గౌహతి వేదికగా ప్రోటీస్‌ జట్టుతో ఆదివారం రోహిత్‌ సేన తలపడనుంది. తొలి టీ20లో ఫలితాన్నే ఈ మ్యాచ్‌లో కూడా పునరావృతం చేయాలని భారత్‌ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. కాగా మ్యాచ్ జరిగే సమయంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది అని అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వర్షం రావడానికి 40 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉంది అని పేర్కొంది. కాగా కరోనా పరిస్థితుల తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్‌ కావడంతో భారీ సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

ఇదిలా ఉండగా.. వర్షం పడితే ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అమెరికా నుంచి రెండు "అత్యంత తేలికైన" పిచ్ కవర్‌లను కొనుగోలు చేశాం.

ఇప్పటికే అస్సాం క్రికెట్‌ ఆసోసియేషన్‌ దాదాపు 20 పైగా కవర్లు ఉన్నాయి. కొనుగోలు చేసిన కొత్త కవర్లు నీరును పిచ్‌లోకి ప్రవేశించకుండా చేస్తాయి అని ఏసీఎ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. కాగా 2020 ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరగాల్సిన టీ20 మ్యాచ్‌ కూడా అస్సాం క్రికెట్ అసోసియేషన్‌ నిర్లక్ష్యం వల్ల రద్దైంది.
చదవండి: RSWS 2022 Final: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్‌.. వరుసగా రెండోసారి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top