Ind Vs SA: తొలి టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

Ind Vs Sa 1st Centurion Test: Day 5 Highlights And Updates In Telugu - Sakshi

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా 113 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. బవుమా 35 పరుగులతో నాటౌట్‌గా  నిలిచాడు. టీమిండియా బౌలర్లలో షమీ 3, బుమ్రా 3, సిరాజ్‌ 2, అశ్విన్‌ 2 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా చివరి ఐదు వికెట్లను 30 పరుగుల లోపే కోల్పోయింది. 

టీమిండియా:
తొలి ఇన్నింగ్స్‌: 327 ఆలౌట్‌
రెండో ఇన్నింగ్స్‌: 174 ఆలౌట్‌

సౌతాఫ్రికా:
తొలి ఇన్నింగ్స్‌: 197 ఆలౌట్‌
రెండో ఇన్నింగ్స్‌: 191 ఆలౌట్‌

3:11 PM: 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. లంచ్‌ విరామం సమయానికి సౌతాఫ్రికా 66 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. బవుమా 34 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తుండగా.. మార్కో జాన్సెన్‌ 5 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లలో  బుమ్రా 3, షమీ 2, సిరాజ్‌ 2 వికెట్లు తీశారు. టీమిండియా విజయానికి కేవలం మూడు వికెట్ల దూరంలో మాత్రమే ఉంది. 

2:23 PM: టీమిండియా విజయానికి మరో 5 వికెట్లు మాత్రమే మిగిలాయి. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా డీన్‌ ఎల్గర్‌ రూపంలో కీలక వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 175 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో బవుమా 10, డికాక్‌ 0 పరుగులతో ఉన్నారు.

1:50Pm: 45 ఓవర్లు ముగిసేసరికి  దక్షిణాఫ్రికా స్కోర్‌: 110/4. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్‌(63),బవుమా(4) పరుగులుతో ఉన్నారు.

1:30 Pm: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య తొలి టెస్టులో భాగంగా అఖరి రోజు ఆటప్రారంభమైంది. నాలుగో రోజు జు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4వికెట్లు కోల్పోయి  94 పరుగులు చేసింది. 52 పరుగులతో డీన్‌ ఎల్గర్‌ క్రీజులో ఉన్నాడు. ప్రొటీస్‌ విజయానికి 211 పరుగుల దూరంలో ఉండగా.. టీమిండియా విజయానికి 6 వికెట్ల దూరంలో ఉంది.

తుదిజట్లు:
భారత్‌: కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్య రహానే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.

దక్షిణాఫ్రికా:
డీన్‌ ఎల్గర్‌(కెప్టెన్‌), ఎయిడెన్‌ మార్కరమ్‌, కీగన్‌ పీటర్సన్‌, రసే వాన్‌ డెర్‌ డసెన్‌, తెంబా బవుమా, క్వింటన్‌ డికాక్‌(వికెట్‌ కీపర్‌), వియాన్‌ మల్దర్‌, మార్కో జాన్‌సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, కగిసో రబడ, లుంగి ఎంగిడి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top