శభాష్‌ హిట్‌మ్యాన్‌.. క్రికెట్‌ చరిత్రలోనే మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు | IND VS ENG 5th Test: Rohit Sharma Becomes First Player To Take 60 Plus Catches In All Three Formats | Sakshi
Sakshi News home page

IND VS ENG 5th Test: శభాష్‌ హిట్‌మ్యాన్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో మొదటి ప్లేయర్‌

Mar 7 2024 3:07 PM | Updated on Mar 7 2024 4:30 PM

IND VS ENG 5th Test: Rohit Sharma Becomes First Player To Take 60 Plus Catches In All Three Formats - Sakshi

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ అద్భుత రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో (ఇంగ్లండ్‌) మార్క్‌ వుడ్‌ క్యాచ్‌ పట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్‌లు అందుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ ఇతర ఆటగాడు మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్‌లు అందుకోలేదు. డబుల్‌ సెంచరీలు, సిక్సర్ల రికార్డులు ఎక్కువగా నెలకొల్పే రోహిత్‌కు క్యాచ్‌ల పరంగా ఇది అతి పెద్ద రికార్డని చెప్పవచ్చు.

కాగా, ధర్మశాల టెస్ట్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. కుల్దీప్‌ యాదవ్‌ (5/72), అశ్విన్‌ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్‌ 27, పోప్‌ 11, రూట్‌ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్‌ 0, ఫోక్స్‌ 24, హార్ట్లీ 6, వుడ్‌ 0, ఆండర్సన్‌ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్‌ బషీర్‌ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement