‘ఆ ఓటమికి చివరి శ్వాస వరకు బాధపడతాను’

Imran Nazir Says World Cup Final Will Hurt Till My Last Breath - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ఓపెనర్‌ ఇమ్రాన్‌ నజీర్‌ 2007 టీ 20 ప్రపంచ కప్‌ ఫైనల్‌పై ఉద్వేగంగా స్పందించాడు. భారత్‌ పాక్‌ మధ్య ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయంతో టీ 20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యచ్‌లో భారత్‌ 158 పరుగుల లక్ష్యాన్ని పాక్‌కు నిర్దేశించింది. అయితే ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి బంతికి మిస్బావుల్‌ హక్‌ను  జోగేందర్‌ శర్మా అవుట్ చేయడంతో టీ 20 ప్రపంచకప్ భారత్‌ సొంతమైంది. కాగా భారత్‌ చేతిలో పాక్‌ ఓటమిని జీర్ణించుకోలేనని, చివరి శ్వాస వరకు తనకు బాధ కలిగిస్తుందని తెలిపారు. ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ ఇమ్రాన్ నజీర్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నందుకు తీవ్ర మనోవేధనకు గురయినట్లు తెలిపారు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో నజీర్‌ ఓపెనర్‌గా దూకుడైన ఆటతో అదరగొట్టాడు. కేవలం 5.3 ఓవర్లలోనే 53పరుగులు సాధించి పాక్‌ మెరుగైన రన్‌రేటును సాధించింది. కేవలం 14బంతుల్లోనే వాయువేగంతో 33 పరుగులను నజీర్‌ సాధించాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న తాను రనౌట్‌ కావడం తీవ్ర నిరాశ కలిగించిందని నజీర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు తీవ్ర అనారోగ్యంతో కొన్ని సంవత్సరాలు క్రికెట్‌కు దూరంగా ఉన్న నజీర్ తన చివర టీ 20 మ్యాచ్‌ శ్రీలంతో 2012లో ఆడాగా, పాక్ తరుపున 9టెస్ట్‌లు, 79వన్డేలు, 25టీ 20 మ్యాచ్‌లను ఇమ్రాన్‌ నజీర్‌ ఆడాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top