
Update: ఐదో టెస్టులో భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 378 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటరల్లో జానీ బెయిర్‌స్టో(114), జో రూట్ (142) సెంచరీలతో చెలరేగారు. సిరీస్2-2తో సమమైంది.
ఎడ్డ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో టీమిండియా ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. 378 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట మగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి మరో 119 పరుగుల దూరంలో నిలిచింది. అయితే 378 పరుగుల లక్ష్యాన్ని ఢిపెండ్ చేయడంలో భారత్ విఫలమైతే.. ఓటమికి టీమిండియా బ్యాటర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.
తొలి ఇన్నింగ్స్‌లో పంత్, జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో పుజారా,పంత్ తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. టెస్టుల్లో ఎక్కువ మంది బ్యాటర్లు రాణించకపోతే.. ప్రత్యర్ధి జట్టుపై అధిపత్యం చెలాయించాలేం. ఒక వేళ ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందితే.. పూర్తి బాధ్యతే బ్యాటర్లదే. ఇక ఈ టెస్టులో పంత్ తన పని తాను చేసుకుపోయాడు. అతడు రెండో ఇన్నింగ్స్‌లో అనఅవసరమైన షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ పరిస్థితులను బట్టి పంత్ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడాని భావిస్తున్నాను" అని యూట్యూబ్ ఛానల్‌లో ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: IND VS ENG 5th Test Day 5: భారత అభిమానులను కలవరపెడుతున్న పంత్ ట్రాక్ రికార్డు