ICC ODI Rankings 2022: Bangladesh Surpass Pakistan to Grab Sixth Place - Sakshi
Sakshi News home page

ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్‌ను వెనక్కునెట్టి ఆరో స్థానానికి చేరుకున్న బంగ్లాదేశ్‌ 

Mar 30 2022 6:24 PM | Updated on Mar 30 2022 7:30 PM

ICC ODI Rankings: Bangladesh Surpass Pakistan To Grab Sixth Place - Sakshi

ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుని సఫారీ గడ్డపై తొలి సిరీస్‌ విజయాన్ని సొంతం చేసుకున్న బంగ్లా పులులు.. వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి ఎగబాకాయి. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన తొలి వన్డేలో 88 పరుగుల తేడాతో ఓటమి చవిచూడటంతో పాకిస్థాన్‌ ఏడో స్థానానికి పడిపోయింది. 


తాజా ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లకు సమానంగా 93 పాయింట్లే ఉన్నప్పటికీ.. రేటింగ్‌ పాయింట్స్‌లో పాక్‌తో పోలిస్తే మెరుగ్గా ఉండటంతో బంగ్లాదేశ్‌ ఆరోస్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ 121 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌ (119), ఆస్ట్రేలియా (117), టీమిండియా (110), సౌతాఫ్రికా (102) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆరు, ఏడు స్థానాల్లో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ ఉండగా.. 8వ స్థానంలో శ్రీలంక (81), 9వ స్థానంలో వెస్టిండీస్ (77), 10వ స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ (68) జట్లు ఉన్నాయి.
చదవండి: ఐపీఎల్‌ మీడియా హక్కుల టెండర్లకు ఆహ్వానం.. బీసీసీఐపై కనకవర్షం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement