Virat Kohli: ఏడో ర్యాంక్‌లో ఉన్న టీమిండియాను నంబర్‌ వన్‌గా నిలబెట్టాను.. 

I Dont Need To Prove Myself To Anyone Says Virat Kohli - Sakshi

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌కు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా సారధి విరాట్ కోహ్లి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని నుంచి టెస్ట్‌ కెప్టెన్సీ తీసుకునే సమయానికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఏడో స్థానంలో ఉండేదని, దాన్ని నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాని, అలాంటి పరిస్థితుల్లో నుంచి టీమిండియాను నంబర్‌ వన్‌గా నిలబెట్టానని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. టెస్ట్‌ల్లో టీమిండియాను నంబర్‌ వన్‌ చేయాలనే టార్గెట్‌తో పని చేశానని, అందుకు ఫలితంగానే టీమిండియా నేటికీ అగ్రస్థానంలో కొనసాగుతుందని పేర్కొన్నాడు. 

రేపటి నుంచి ప్రారంభంకానున్న ఆఖరి టెస్ట్‌కు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా స్పష్టం చేసిన కోహ్లి.. తాను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని అన్నాడు. ఇదే సందర్భంగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై మాట్లాడుతూ.. రెండో టెస్ట్‌లో వికెట్లు తీసేందుకు రాహుల్‌ అన్ని వ్యూహాలను అమలు చేశాడని, కానీ దక్షిణాఫ్రికా అద్బుతంగా ఆడి మ్యాచ్‌ను లాగేసుకుందని తెలిపాడు.

జట్టును నడిపించడంలో ఎవరి స్టైల్‌ వారికి ఉంటుందని, రాహుల్‌ కూడా తన స్టైల్‌లోనే జట్టును నడిపించాడని వివరించాడు. గంటకు పైగా సాగిన ప్రెస్‌మీట్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు కోహ్లి తనదైన శైలిలో బదులిచ్చాడు. ఇదిలా ఉంటే, రేపటి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. రెండో టెస్ట్‌లో గాయపడిన సిరాజ్‌ స్థానంలో ఇషాంత్‌ శర్మ, విహారి ప్లేస్‌లో విరాట్‌ కోహ్లి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. 

టీమిండియా తుది జట్టు (అంచనా): కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: Virat Kohli: పంత్‌ గుణపాఠాలు నేర్చుకుంటాడు.... ఇక రహానే, పుజారా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top